Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

స్టార్ స్టేటస్ దిశగా నాగచైతన్య

nagachaitanyaఅక్కినేని హీరో నాగచైతన్య స్టార్ స్టేటస్ సంపాదించే దిశగా కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమాలు ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తూనే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఇందులో భాగంగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా… టాలెంటెడ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అష్టాచమ్మా, అంతకుముందు ఆతర్వాత, గోల్కొండ హైస్కూల్, జెంటిల్‌మన్ సినిమాలతో తెలుగులో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న మోహనకృష్ణ… నాగచైతన్య కోసం ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇలా వరుసగా తన ఇమేజ్‌కు సరిపడే కథలనే ఎంచుకుంటూ హీరోగా స్టార్‌డమ్ సంపాదించుకునే దిశగా నాగచైతన్య చేస్తున్న ప్రాజెక్టులు మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Comments

comments