Home వార్తలు ప్రారంభమైన ‘డబ్బా శీను’

ప్రారంభమైన ‘డబ్బా శీను’

Dabba-Seenuబాబునాయక్, కులకర్ణి మమత హీరో హీరోయిన్‌లుగా అమూల్య ప్రొడక్షన్స్ సమర్పణలో వరంగల్ టాకీస్ బ్యానర్‌లో రఘు పూజారి దర్శకత్వంలో గుర్రపు విజయ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘డబ్బా శీను’. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా.. మొదటి షాట్‌కు ప్రముఖ దర్శకుడు సాగర్ దర్శకత్వం వహించగా… తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ “బాబు నాయక్ చేసిన హార్డ్‌వర్కే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. కష్టపడితే ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలను అందుకుంటారన్న దానికి బాబు నాయక్ నిదర్శనం”అని చెప్పారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి సినిమాలన్నింటినీ ఆదరిస్తుంటారు. మంచి విషయం ఉన్న ‘డబ్బా శీను’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చలపతిరావు, కవిత, చమ్మక్ చంద్ర, ఫణి, రచ్చ రవి, చిట్టిబాబు, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః జె.పి.రామారావు, డ్యాన్స్‌ః బాలు, పాటలుః చంద్రబోస్, కందికొండ, మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యాం, కెమెరామెన్‌ః జి.ఎల్.బాబు, ఫైట్స్‌ః అవి, సంగీతంః రాక్ షకీల్, కథః తన్నీరు పాండు రంగారావు.