Search
Sunday 18 November 2018
  • :
  • :

ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

policeసంగారెడ్డి ప్రతినిధి : ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,600 మంది అభ్యర్థులు ఎంపిక కాగా, మూడురోజుల పాటు ప్రతిరోజు 1200 మంది చొప్పున అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎత్తు, ఛాతి కొలతలతో పాటు రన్నింగ్, షార్ట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ వంటి పరీక్షలు నిర్వహిం చారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఎస్సీ వెంకన్నలు ఈ పరీక్షలను పర్యవేక్షిం చారు. జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు పరీక్షల నిర్వహణలో పాల్గొన్నారు. కాగా ఉదయం నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కానుండడంతో వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు జిల్లా కేంద్రానికి ఆదివారం రాత్రికే చేరుకున్నారు. అభ్యర్థులలో పరేడ్ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ పరీక్షలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని కొందరు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు వారు చదివే కళాశాలలో ఉండడంతో కస్టోడియన్ లెటర్ తీసుకురావాలని, తరువాత పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అనుమతిం చారు.

Comments

comments