Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రాహుల్‌ గాంధీకి నోటీసులు…

rahul-gandi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అమనుషా ఘటనకు చెందిన ఓ వీడియోను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ రాష్ట్ర బాలల హక్కుల సంఘం రాహుల్ కు నోటీసులు పంపింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఆ సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన ఆ సంఘం మైనర్‌ బాలల గుర్తింపును బయట పెట్టడం నేరం, అందుకే ఈ నోటీసులు పంపినట్లు స్పష్టం చేసింది. ఈ నోటీసులపై రాహుల్ స్పందిచేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. ఇద్దరు దళిత బాలలు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేశారు. దీంతో వాళ్లను పట్టుకున్న కొందరు అగ్రకులస్తులు వారిని నగ్నంగా ఊరేగించి చితకబాదారు. ఆ వీడియోనే ఈ మధ్య కాలంలో రాహుల్‌ గాంధీ సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ.. ఈ దళిత బాలలు చేసిన ఒకే ఒక్క తప్పు అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయడమే  నేటి సమాజంలో మానవ జాతి తన పరువు ప్రతిష్ఠలను కాపాడుకునేందుకే పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి, ఆర్ ఎస్ఎస్ విద్వేషపూరిత రాజకీయాలకు మనం వ్యతిరేకంగా పోరాడలని ఆయన పిలుపు నిచ్చారు. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదంటూ ఆయన ట్వీట్ చేశారు.

Comments

comments