Home తాజా వార్తలు రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసు ప్రారంభం

రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసు ప్రారంభం

State Farmers' Coordination Committee Office Starts

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసును బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రైతుబంధు, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

State Farmers’ Coordination Committee Office Starts