Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఖిల్లా

State Formation  Day  Celebrations

మనతెలంగాణ/జగిత్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని చారిత్రాత్మక కట్టడమైన ఖిల్లా ముస్తాబైంది. వేడుకల నేపథ్యంలో గత వారం రోజులుగా ఖిల్లాలోని చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు, ప్ర ముఖులు కోసం ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లను నిర్మించారు. అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏ ర్పాటు చేయడంతో పాటు డాగ్ స్కాడ్‌తో తనిఖీలు జరిపారు.ఖిల్లా ముందు భాగంలో విద్యుత్ దీపాలతో అలంకరించారు.వివిధ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాట్లలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
జిల్లా ఎస్‌పి సునీల్‌దత్ ఆధ్వర్యంలో డిఎస్‌పి భద్రయ్య, 5గురు సిఐలు, 18మంది ఎస్‌ఐలు, 32 మంది ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు ,96 మంది కానిస్టేబుళ్లు,46మంది హోంగార్డులు పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలను మెటల్ డిటెక్టర్‌ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఖిల్లా లోనికి పంపించేలా ఏర్పాట్లు చేశారు.

Comments

comments