Home తాజా వార్తలు వెల్లడైన విఆర్‌ఒ ఫలితాలు

వెల్లడైన విఆర్‌ఒ ఫలితాలు

State Public Service Commission

 

వెబ్‌సైట్‌లో మార్కులు, అభ్యర్థుల ర్యాంకులు
ఉత్తీర్ణత సాధించిన 7,38,885 మంది

వెబ్‌సైట్‌లో డిజిటల్ ఓఎంఆర్ పత్రాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (విఆర్‌ఒ) పరీక్ష ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. రాత సరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 7,38,885 మంది ర్యాంకులను కూడా కమిషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 700 విఆర్‌ఒ పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 2,945 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన రాత పరీక్ష జరగ్గా 7,87,049 (78.46 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 83 శాతం హాజరు నమోదైంది. విఆర్‌ఒ పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు టిఆర్‌ఎస్‌సి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కమిషన్ కార్యాలయం నుంచి కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను స్కానింగ్ చేసి డిజిటల్ రూపంలో వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అభ్యర్థులు గుర్తించిన సమాధానాలు సరిచూసుకోడానికి ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

State Public Service Commission released results VRO

Telangana Latest News