Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రాలు 5% వ్యాట్ తగ్గించాలి

 ఇంధన ధరలపై పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

Pradhan

న్యూఢిల్లీ : రాష్ట్రాలు సహకరిస్తే ఇంధన ధరలు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పా రు. రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై కనీసం వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గి, వినియోగదారులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇంధన ధరల భారం పడకుండా కేంద్రం అన్ని చర్యలూ తీసుకొంటొందని, ఇదే విధంగా రాష్ట్రాలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందని , వినియోగదారుల సౌలభ్యం కోసం స్పందించాల్సి ఉందని మంత్రి విజ్ఞప్తి చేశారు. 5 శాతం వ్యాట్‌ను తగ్గించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక మంత్రి లేఖలు రాస్తారని ఇంధన మంత్రి వివరించారు. ఆటో ఫ్యూయల్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రోలు ధరలను లీటరుకు రూ 2.5, డీజిల్‌పై రూ 2.25 చొప్పున బుధవారం నుంచి తగ్గించారు. ఢిల్లీలో ఇప్పుడు పెట్రోలు లీటర్ ధర రూ 68.38గా ఉంది. ఇక డీజిల్ ధర రూ 56.89గా ఉం ది. కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు క్రితమే ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రెండు రూపాయల చొప్పున తగ్గించింది. దీనితో గత మూడు నెలలుగా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు కొంత బ్రేక్ పడింది.
దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు
మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చా యి. రోజువారీ సమీక్షలో భాగంగా బుధవారం ఉదయం పెట్రో ధరల్లో మార్పు కనిపించింది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.2.25, కోల్‌కత్తాలో రూ.2.25, ముంబైలో రూ.2.38, చెన్నైలో రూ.2.41 తగ్గినట్టు సమాచారం. రిటైల్‌లో లీటరు డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.56.89గా, కోల్‌కత్తాలో రూ.59.55గా, ముంబయిలో రూ.60.43గా, చెన్నై లో రూ.59.89గా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ లో ఈ రేట్లు వెల్లడించారు. మరోవైపు పెట్రోల్ ధరలు ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబైలలో లీటరు పెట్రోల్ ధర రూ.2.5 తగ్గినట్టు వెల్లడైంది. చెన్నైలో రూ.2.6 మేరకు తగ్గింది. లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.38గా, కోల్‌కత్తాలో రూ. 71.16గా, ముంబయిలో రూ.77.51గా, చెన్నైలో రూ. 70.85గా నమోదయ్యాయి. పెరుగుతున్న ఇంధన ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్స్చేంజ్ సుంకం తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. తగ్గింపు అనంతరం ఈ సుంకాలు వరుసగా రూ.19.48, రూ.15.33గా ఉంటాయి.

Comments

comments