Home జాతీయ వార్తలు జాట్‌ల కోటా నిలిపివేత

జాట్‌ల కోటా నిలిపివేత

పంజాబ్-హర్యానా హైకోర్టు స్టే

punjab-haryana-highcourtచండీగఢ్: జాట్‌లు, మరో ఐదు కులాలను కొత్తగా బిసి(సి) కేటగిరీలోకి చేరు స్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టంపై పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు గురువారం స్టే విధించింది. ఇటీవల హర్యానా అసెంబ్లీ జాట్‌లు సహా బిసి కులాలకు విద్య, ఉద్యోగా వకాశాలలో 10శాతం రిజర్వేషను కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిం చిన విషయం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాం గ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపి దాని అమ లుపై స్టే విధించింది. జస్టిస్ ఎస్‌ఎస్.శారన్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో భివానీకి చెందిన మురారీలాల్ గుప్తా జాట్‌లు సహా ఇతర కులాలకు కొత్తగా రిజర్వేషన్లను కల్పించడాన్ని సవాల్ చేశారు. ఈ కులాలను బ్లాక్ ‘సి’లోకి మారుస్తూ చేసిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ చేసిన చట్టం చెల్లనేరదని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసినప్పటికీ, జస్టిస్ కెసి.గుప్తా సమర్పించిన నివేదిక ఆధారంగా  ఈ కులాలకు రిజర్వేషన్లు కల్పించారని పిటిషనర్ ఆక్షేపించారు. ఈ కులాలకు రిజర్వేషన్లు పెంచడం, కల్పించడం అనేది న్యాయ వ్యవస్థ పరిధిలోకి మాత్రమే వస్తుంది తప్ప చట్ట సభలకు అధికారం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. 2014లో పిటిషన్‌ను దాఖలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి జాట్లకే కాకుండా జాట్ సిక్కులు, ముస్లిం జాట్‌లు,  బిష్ణోయిలు, రోర్లు, త్యాగీ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల అడ్మిషన్లలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. పిటిషనర్ ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మహేశ్ గ్రోవర్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు  వాదనలు వినిపించారు.