Search
Wednesday 14 November 2018
  • :
  • :

ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం

cong2

*కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ

మనతెలంగాణ/పెద్దపల్లి : ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజాస్వామ్యాన్ని కెసిఆర్ ఖూని చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అక్రమాలపై శాసనసభలో ప్రశ్నిస్తారనే భయంతో ఇద్దరు కాంగ్రెస్ శాసన సభ్యుల సభ్యత్వాలను రద్దుచేసి ప్రజాస్వామ్య విలువలను కాలరాశాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షహోదాలో ఉన్న శాసన సభ్యులకే రక్షణ లేకుంటె సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి ఉండి లాఠి దెబ్బలు తిన్న వారిని కాదని ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు కట్టబెడుతూ అందలం ఎక్కిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ మేధావి వర్గం టిఆర్‌ఎస్ నిరంకుశ పాలనపై ఆలోచించాలని ఆమె విజ్ఙప్తి చేశారు. కెసిఆర్ కుటుంబం యొక్క అవినీతి అక్రమాలు, మోసపూరిత వాగ్దానాలను ఎక్కువ రోజులు తెలంగాణ ప్రజలు భరించడానికి సిద్దంగా లేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు పేరు మార్చి రీడిజైనింగ్ చేసి అంచనా వ్యయాన్ని రెండింతలు పెంచి, కాంట్రాక్టర్ల నుండి  వేలాది కోట్ల రూపాయల వేలాది కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో కెసిఆర్ కుటుంబందండుకుంటోందని ఆరోపించారు. జిల్లాలో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిన పంటలకు నష్ట పరిహరం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈర్ల కొంరయ్య, గీట్ల సవితా రెడ్డి, వేముల రామ్మూర్తి, కొండి సతీష్, కుంబం సంతోష్, మంథని నర్సింగ్, కనుకుంట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments