Home తాజా వార్తలు గుండె మరమ్మతు చేసే మూలకణాల పాచ్‌లు…

గుండె మరమ్మతు చేసే మూలకణాల పాచ్‌లు…

heart-attack

గుండెపోటు వల్ల దెబ్బతిన్న గుండెలను బాగు చేయడానికి గుండె అతుకుల ముక్కలను ప్రయోగశాలలో మూలకణాలతో శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ అతుకులను ప్రయోగశాలలో వృద్ధి చేస్తున్నట్టు చెడిపోయిన గుండెలను బాగు చేయడానికి ఇవి త్వరలో ఉపయోగపడతాయని బ్రిటిష్ హార్టు ఫౌండేషన్ వెల్లడించింది. జంతువుల్లో ఈ ప్రయోగాలు ఫలించాయని, మరో రెండేళ్లలో మనుషులపై వైద్యపరంగా ప్రయోగాలు చేయడమవుతుందని పేర్కొంది. 3 సెంమీ నుంచి 2 సెంమీ వరకు బొటనవేలి సైజులో ఉండే గుండె కండరాల ముక్కలు ఒక్కొక్కటి 50 మిలియన్ మానవ మూల కణాలతో కూడి ఉంటాయి.

వీటిని పనిచేసే గుండె కండరాల కణాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకటి అంతకన్నా ఎక్కువ అతుకులు (పాచ్‌లు) రోగి గుండెలో అమర్చి ఎలాంటి ప్రమాదం గుండెకు రాకుండా చూస్తారు. గుండెపోటు వచ్చినప్పుడు విలువైన పోషకాలు గుండెకు కరువైతాయి. ఆక్సిజను కూడా అందదు. గుండె కణాలు చనిపోతాయి. ఫలితంగా గుండె బలహీనమై గుండె పనిచేయలేని వైఫల్యం ఏర్పడుతుంది. ఇటువంటి దుస్థితి బ్రిటన్‌లో 9,20,000 మందికి సంభవించింది. ఇప్పుడు మూలకణాలతో తయారవుతున్న అతుకులు (పాచ్‌లు) భౌతికంగా గుండెకు సహాయపడి పంపింగ్ బాగా జరిగేలా చూస్తాయి. ఈ సందర్భంగా రసాయనాలు వెలువడి గుండె కణాలు చైతన్యం అయ్యేలా ప్రేరేపిస్తాయి.

గుండెను మరమ్మతు చేసి తిరిగి పునరుజ్జీవం చేస్తాయి. ప్రయోగాలలో పాచ్‌లు మూడు రోజుల తరువాత పనిచేయడం ప్రారంభించి నెలరోజుల్లోనే గుండె కండరాలుగా పరిపక్వం చెందడం కనిపించింది. జంతువుల్లో గుండె పోటు వచ్చిన తరువాత పాచ్‌ల వల్ల గుండె పనితీరు మెరుగుపడింది. గుండె నుంచి రక్త నాళాలు పాచ్‌లో పెరగడం కనిపించింది. రోగులందరికీ కావలసినన్ని పాచ్‌లు ముందుగా తయారు చేసి నిల్వ ఉంచడమే లక్షంగా శాస్త్రవేత్తలు పెట్టుకున్నారు. దీనివల్ల గుండె పోటు ఎవరికైనా వస్తే వెంటనే పాచ్‌ను అమర్చుకుని కుదుట పడడానికి వీలవుతుంది.

Stem cell patches could help mend hearts after heart attack

సైన్స్ విభాగం