Home తాజా వార్తలు హాలెప్ x స్టీఫెన్స్

హాలెప్ x స్టీఫెన్స్

halep-vs-stefin

పారిస్: టాప్ సీడ్, రొమానియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్, మాజీ ఛాంపియన్ గర్బైన్ ముగురుజాను గురువారం 61, 64తో ఓడించి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లోకి ప్రవేశించింది. గతంలో 2014, 2017లో కూడా హాలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆమె తదుపరి శనివారం ఫైనల్‌లో స్లోన్ స్టీఫెన్స్ లేదా మాడిసన్ కీస్… ఎవరో ఒకరితో తలపడనుంది. ప్రపంచ మూడో సీడ్ క్రీడాకారిణి ముగురుజాను ఓడించిందంటే ఆమె వచ్చే వారం ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకోవడం దాదాపు ఖాయం అనే చెప్పాలి. మొదటి సెట్‌ను గెలిచిన హాలెప్ మారథాన్ తొమ్మిదో గేమ్‌లో మూడు బ్రేక్ పాయింట్లు ఆదా చేసింది. రెండో సెట్‌లోని తొమ్మిదో గేమ్ 13 నిమిషాల్లో ముగిసింది. గెలిచాక హాలెప్ మాట్లాడుతూ ‘ గొప్ప ప్రత్యర్థితో క్లే కోర్టులో నేను బాగానే ఆడానని అనుకుంటున్నాను’ అంది. ‘రెండో సెట్‌లో నేను 24తో వెనుకబడ్డాను. కానీ ప్రతి బాల్‌ను బాగా ఆడాల్సిందేనని అనుకున్నాను. మంచి వ్యూహంతో ఆడాను’ అని కూడా హాలెప్ చెప్పింది.
తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కి స్టీఫెన్స్
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి స్లోలెన్ స్టీఫెన్స్ తన ప్రత్యర్థి మాడిసన్ కీస్‌ను గురువారం 64, 64తో ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. వరుస సెట్లతో కీస్‌ను కోలుకోకుండా చేసి రెండు సెట్లలోనే మ్యాచ్‌ను గెలుపొందింది. తదుపరి ఆమె శనివారం టైటిల్ కోసం సిమోనా హాలెప్‌తో తలపడబోతున్నది.

ఫ్రెంచ్ ఓపెన్‌లో పట్టు సడలించని నాదల్

nadal

స్పెయిన్‌కు చెందిన 32 ఏళ్ల రాఫెల్ నాదల్ గురువారం అ ర్జెంటీనాకు చెందిన తన ప్రత్యర్థి డియెగో స్కార్ట్‌జ్‌మన్‌ను 46, 63, 62తో ఓడించాడు. వాన అంతరాయంగా ఆ గి మరునాడు కొనసాగిన క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి, గతంలో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు దగ్గరయ్యాడు. ఇలా సెమీఫైనల్‌కు చేరడం అతడికిది 11వ సారి. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంటులో ఇలాంటి అరుదైన ఫీట్ చేసినవారిలో మూ డో వ్యక్తిగా నిలిచాడు. ఇదివరలో యుఎస్ ఓపెన్‌లో జిమ్మీ కానర్స్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో , వింబుల్డన్‌లో రోజర్ ఫెడరర్ ఈ ఫీట్‌ను సాధించారు.ఈ ప్రపంచ నెం. 1 ఆటగాడు తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. రాఫెల్ నాద ల్ తదుపరి అర్జెంటీనా ఐదో సీడ్ ఆటగాడైన జువాన్ మార్టిన్ డెల్ పోట్రోతో సెమీఫైనల్‌లో తలపడనున్నాడు. 16సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన నాదల్ గెలిచాక మాట్లాడుతూ ‘ అది చాలా కష్టమైన ఆట. డియెగో మంచి మిత్రుడు, చక్కని ఆటగాడు. వాన వల్ల ఆగిపోయిన ఆటను తర్వాత చాలా దూకుడుగా ఆడి గెలిచాను. సెమీఫైనల్‌లోకి ప్రవేశించడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అన్నాడు.