Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మీ సేవ కేంద్రాల్లో తహసీల్దార్ తనిఖీ

Steps to provide certificates to students in time

మణుగూరు రూరల్ : గత రెండు రోజుల క్రితం మనతెలంగాణలో ‘కనికరించని రెవిన్యూ సిబ్బంది’ అనే శీర్షికతో వెలువడిన వార్త కథనానికి గురువారం తహసీల్దార్ నారాయణమూర్తి స్పందించారు. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకునే మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీసేవ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. సకాలంలో సమయానికి మీ సేవ కేంద్రాలు తెరవాలని, మీ సేవ కార్యాలయాలలో పరిశుభ్రతగా ఉంచి కేంద్రాలకు వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలన్నారు. అంతేకాకుండా దరఖాస్తుకు అయ్యే ఖర్చు సరైన ధరల పట్టికను కేంద్రంలో బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థుల వద్ద నుండి వ్యక్తిగతంగా అధిక సొమ్ము వసూలు చేసినట్టుగా సమాచారం వస్తే మీ సేవ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుని, మీసేవ కేంద్రాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల, తదితర ధృవీకరణ పత్రాల విషయంలో మీ సేవ కేంద్రాలు సరైన పద్దతిలో పని చేయాలని సూచించారు. ఎట్టకేలకు మనతెలంగాణ కథనానికి తహసీల్దార్ స్పందించి మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments