Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కుల వివక్షలేని రాష్ట్రం దిశగా అడుగులు

Steps towards the caste-ridden state

తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ 

మన తెలంగాణ/సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రాన్ని అంటరానితనం, కులవివక్ష లేని రాష్ట్రంగా రూపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహాశీల్దార్లు, ఎంపిడి వోలు, మండల స్థాయి పోలీసు, ఇతర అధికారులకు పీసీఆర్, పీడీఏ చట్టాల అమలుపై ( ఓరియెంటేషన్) పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అతితక్కువ కేసులు నమోదైన జిల్లా సంగారెడ్డిగా శ్రీనివా స్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులందరూ కలిసి జిల్లాను అంటరానితనం, కులవివక్షలేని జిల్లాగా ఏర్పాటు చేయా లని కోరారు. రాష్ట్రంలో 6వేల కేసులలో 90శాతం కేసులకు రిలీఫ్‌ఫండ్ వచ్చిందని పేర్కొన్నా రు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ వినతి మేరకు కాంట్రాక్ట్ పనులలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్రప్రభుత్వానిదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రక్షణ చట్టాలు సక్రమంగా అమలు చేసినపుడే గ్రామాలన్ని సురక్షితంగా ఉంటాయని తెలిపారు. ప్రతి నెల 30న జరిగే పౌర హక్కుల దినంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ చట్టాల్లోని అంశాలన్ని వారికి అవగతం కావాలని, వారిపట్ల జరిగే అన్యాయాలకు ఎలాంటి చర్యలుంటయన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నా రు. చట్టానికి లోబడి జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ తెలిపా రు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొన్ని కులాలపై చారిత్రా త్మకంగా వస్తున్న వివక్షత విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్య త అందరిపై ఉందన్నారు. కులవివక్షత, అంటరానితనం, అట్రాసిటిలు జరిగినపుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉం దన్నారు. అలాంటి కేసులపై పోలీసులు నిష్పక్షపాతంగా, పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రిటైర్ట్ జడ్జి ఆనందరావు సిసిఆర్, పివోఏ చట్టాలు, ఎస్సీ,ఎస్టీ హక్కులు, రక్షణ చట్టాలపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో జేసి నిఖిల, ఎస్సీ, ఎస్సీ కమీషన్ స భ్యులు నర్సింలు, దేవయ్య, రాంబాల్‌నాయక్, షెడ్యూల్డ్‌కులాల అభివృ ద్ధి అధికారి శ్రీధర్, సంక్షేమాధికారి బాబురావు, జిల్లా అధికారులు, ఆర్డీ వోలు, డీఎస్పీలు, సీఐలు, తహాశీల్దార్లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.

Comments

comments