Home రంగారెడ్డి బంగారు తెలంగాణ వైపు అడుగులు: స్వామిగౌడ్

బంగారు తెలంగాణ వైపు అడుగులు: స్వామిగౌడ్

Steps towards the golden angle of gold

రంగారెడ్డి: రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తుందని శాసన మండలి చైర్మెన్ స్వామి గౌడ్ పేర్కొన్నారు. బుధవారం సైబారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. స్థానిక సంస్థల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం, నేటి నుంచి రైతు బీమా అమలు చేస్తున్నారని. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందత్వ రహిత తెలంగాణ స్థాపనకు కృషి చేయడం అభినందనీయమన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి దేశంలోనే రికార్డు సృష్టించిందాని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తున్నాయని ఐటి రంగంలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ వంటి పథకాలతో పేదలు ఇళ్లలో పెళ్లిలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న చర్యల వలన రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వడివడిగా సాగుతుందన్నారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 161 మందికి ప్రశంసా పత్రాలను అందచేశారు. పలు శాఖలు ప్రదర్శించిన శకటాలు విశేషంగా అకట్టుకున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్దులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అకట్టుకున్నాయి.

రుణాల పంపిణి…
మైనార్టీ శాఖ ద్వారా పది మందికి షాదీ ముభారక్ చెక్కులతో పాటు ముగ్గురికి బ్యాంకు లోన్‌లను స్వామి గౌడ్ చేతుల మీదుగా అందచేశారు. వంద మంది బిసిలకు ఒక్కోకరికి రూ.50 వేల రుణాలను, ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా 24 మంది లబ్దిదారులకు 1.53 కోట్లతో మంజూరు చేసిన కార్లు, ఆటోలను పంపిణి చేశారు. కలెక్టర్ రఘనందన్‌రావు, సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్‌లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.