Search
Sunday 18 November 2018
  • :
  • :

తెగని తగవు

tnచెన్నై : తమిళనాడు రాజకీయ సంక్షోభంపై ఉత్కం ఠ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రపతికి నివేదించిన గవర్నర్ అదే సమయంలో న్యాయ కోవిదుల సల హాలను కూడా తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు ఉన్నతాధికారులతో శుక్రవారంనాడు సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరి జా వైద్యనాథన్, డిజిపి టికె రాజేంద్రన్, చెన్నై పోలీస్ కమిషనర్ ఎస్.జార్జిలను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు, పాల నా పరిస్థితిపై ఆరా తీశారు. 45నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. బలం నిరూపించుకోవాలని తమకే అవకాశం కల్పిస్తారని ఒకవైపు సిఎం పన్నీ ర్ వర్గం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తమను గవర్నర్ ఆహ్వానిస్తారని మరోవైపు శశికళ వర్గం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు సిఎంగా శశికళ ప్రమాణ స్వీకారాన్ని నిలిపివే యాలంటూ సుప్రీంకోర్టులో దాఖలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఆమెకు ఊరట లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా ఈ పిల్‌ను విచారించలేమని సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. చెన్నై వాసి సెంథిల్ కుమార్, మరో ఎన్‌జిఓ ఈ వ్యాజ్యాన్ని 6వ తేదీన దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్‌తో స్టాలిన్ భేటీ
అధికార అన్నాడిఎంకేలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు, డిఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ శుక్రవారం రాత్రి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాట జరుగుతుండడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ప్రజలను పట్టించుకునే వారే లేరని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో త్వరగా అనిశ్చితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 9 నెలలుగా రాజకీయ సంక్షోభం నెలకొందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్టాలిన్ అన్నారు.

Comments

comments