Home జిల్లాలు పైపు లొల్లి

పైపు లొల్లి

జలమండలి, మెట్రోల మధ్య గొడవ

బేగంపేట్ వద్ద పైప్‌లైన్ ధ్వంసం
జలమండలి సీరియస్
పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

hmwssbసిటీబ్యూరో: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం చి లికి చిలికి గాలివానగా మారుతోంది. అధికా రులకు ముందుచూపు లేకపోవడంతో శాఖ ల మధ్య అగాధం పెరగడం ప్రజలకు శాపం గా మారుతోంది. సరైన జాగ్రత్తలు తీసుకో కుండా పనులు నిర్వహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నారు. బే గంపేట్ గురుమూర్తి నగర్ జబ్బర్ బిల్డింగ్ లైన్‌లో మెట్రోపిల్లర్ నిర్మాణం కోసం తవ్వ కాలు జరుపుతుండగా సీవరేజి పైప్‌లైన్ ధ్వంసమైంది. దీనితో మురుగునీరు ఏరులై పారు తోంది. పరిసర ప్రాంతాల్లో మురుగునీరు ముంచెత్తింది. తమ నుంచి అనుమతి లేకుండా సీవరేజి పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడం పట్ల వాటర్‌బోర్డు అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెట్రోరైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిపై వాటర్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాష్ నగర్ రిజర్వాయర్ జి.ఎ. వెంకటేశం, ఎల్ అండ్ టి ప్రాజెక్ట్ మేనేజర్ పవన్‌బాబుపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

శుక్రవారం అర్ధరాత్రి తరువాత బేగంపేట్ జబ్బర్ బిల్డింగ్ లైన్లో గురుమూర్తి నగర్ వద్ద మెట్రో రైల్ పిల్లర్ నిర్మాణం చేసేందుకు తవ్వకాలు జరిపారు. కూకట్‌పల్లి నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రవహించే సీవరేజి భారీ నాలాపైప్‌లైన్ ఉంది. హడావుడిగా పనులు చేపట్టిన ఎల్ అండ్ టి సిబ్బంది పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. దీనితో పెద్ద ఎత్తున మురుగునీరు రోడ్డుపైకి వచ్చి జలమయమయ్యింది. ఫలితంగా పరిసర ప్రాంతాలు దుర్గంధ పూరి తంగా మారాయి. కాలుష్యంతో కూడుకున్న మురుగునీటి దుర్వా సనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాటర్‌బోర్డు అధికారులు మెట్రోరైల్, ఎల్ అండ్ టి అధికారులను ఆరా తీశారు. పైప్‌లైన్ ధ్వంసం విషయం తమకు సంబంధం లేదని వాటర్‌బోర్డు అధికారులకు ఎల్ అండ్ టి ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపినట్లు సమాచారం. ఎల్ అండ్ టి ఇంజనీర్లు నిర్లక్షపూరిత సమాచారం ఇవ్వడంతో వాటర్‌బోర్డు అధికారులు బేగంపేట పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యా దులు స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మెట్రోరైల్ నిర్మాణం కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అను మతులు, పైప్‌లైన్లు, విద్యుత్ స్తంభాలు, తదితర సౌకర్యాలకు సంబం ధించిన వాటిని తొలగించేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి అనుమతుల విషయంలో ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ పర్చేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ పేరిట ప్రభుత్వం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసింది. మెట్రోరైల్ నిర్మాణం కోసం ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మెట్రోరైల్ నిర్మాణం కోసం సహకరించాలని, ఇతర శాఖలకు సంబంధించి మౌలిక సౌకర్యాలకు సంబంధించిన వాటిని తొలగించాల్సి అవసరం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనం తరం తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బేగంపేట్‌లో పైప్‌లైన్ తొలగింపు విషయంలో వాటర్‌బోర్డు నుంచి అనుమతి తీసుకో కుండానే తొలగించారు. దీనికి తోడు కూకట్‌పల్లి నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఉన్న భారీ సీవరేజీ పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. స్థానికు ల ఫిర్యాదుతో పరిశీలించిన వాటర్‌బోర్డు అధికారులు సీవరేజీ పైప్‌లైన్ ధ్వంసమైన విషయాన్ని గుర్తించారు. ఈ విషయంపై ఎల్ అండ్ టి ఇంజనీర్లను సంప్రదించారు. వారు తమకు సంబంధం లేనట్లుగా స్పదించడంతో వాటర్‌బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైప్‌లైన్ ధ్వంసం వివాదం కాస్తా పోలీసు ఠాణాకు చేరింది.