Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘బేర్’ మన్న స్టాక్‌మార్కెట్

STOCKముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్ మరోసారి ‘బేర్’మన్నాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి మార్కెట్లు 20 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాలతో కొనసాగాయి. ఆరంభ దశలో సెన్సెక్స్ ఏకంగా 625 పాయింట్ల నష్టానికి పడిపోగా, నిఫ్టీ 189 పాయింట్లకు పైగా కోల్పోయింది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 417 పాయింట్ల నష్టంతో 24,062 పాయింట్ల వద్ద ముగియగా, 125 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 7,309 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68 వద్ద కొనసాగుతుంది.

Comments

comments