Home తాజా వార్తలు నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్‌మార్కెట్

నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్‌మార్కెట్

STOCK-MARKET-1ముంబయి : బుధవారం స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లను నిరాశపరించింది. పారిస్ ఉగ్రదాడి నేవధ్యంలో స్టాక్‌మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. బుధవారం స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 381 పాయింట్ల నష్టంతో 25,482 పాయింట్ల వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 7,731 పాయింట్ల వద్ద ముగిశాయి. భారత స్టాక్‌మార్కెట్లు మాత్రమే కాకుండా దాదాపు అన్నీ అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. భారత స్టాక్‌మార్కెట్‌లో గేల్, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, సన్ ఫార్మా షేర్లు లాభాల బాట పట్టగా, హిందాల్కో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పిఎన్‌బి, వేదాంత షేర్లు నష్టాలతో ముగిశాయి.