Search
Monday 24 September 2018
  • :
  • :

31,000 దిశగా సెన్సెక్స్

  • రికార్డు స్థాయి గరిష్టానికి సూచీలు
  • కలిసివచ్చిన దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులు
  • బిఎస్‌ఇ సూచీ 30,750, నిఫ్టీ 9,510

Sensexముంబయి: వరుసగా రెండు రోజులుగా నష్టాలను నమోదు చేసిన స్టాక్‌మార్కెట్ గురువారం రికార్డు స్థాయి లో దూసుకెళ్లింది. భవిష్యత్‌లో రేట్ల పెంపుపై మరింత జాగ్రత్త వహిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వు సంకేతాలు ఇవ్వడం మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసివ చ్చింది. మరోవైపు విదేశీ పెట్టుబడుల జోరుతో ప్రారంభం నుంచే సూచీలు ర్యాలీ బాటపట్టాయి. బ్రిటన్ ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత రెండు రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న సూచీలు.. ఒక్క సారిగా పరుగులు తీశాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి కొత్త రికార్డును సాధించగా.. నిఫ్టీ మళ్లీ 9,500 పైకి చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 448 పాయింట్లు లాభపడి 30,750 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 9,510 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో ఎల్ అండ్ టి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎసిసి లిమిటెడ్ తదితర షేర్లు లాభాలను నమోదు చేశాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ మొదలైన షేర్లు నష్టాల బాటపట్టాయి. బ్యాంకు నిఫ్టీ భారీగా 3 శాతం మేర పెరగ్గా, మిడ్‌క్యాప్స్ కూడా లాభాలను చూసింది. మార్కెట్ మరోసారి భారీ లాభాలను నమోదు చేయడానికి కారణం.. ఆసియన్ ఈక్విటీ మార్కెట్లు రెండేళ్ల గరిష్టంలో నమోదు కావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై స్పష్టత వచ్చేంతవరకు వడ్డీరేట్ల పెంపు నిలిపివేయాలని ఫెడరల్ రిజర్వు సంకేతాలు ఇవ్వడం.. అయితే మే డెరివేటివ్స్ గడువు గురువారంతో ముగుస్తుండడమూ ఓ కారణంగా చెబుతున్నారు.

ప్రపంచ స్టాక్స్
వడ్డీ రేట్లపై తొందపడబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలతో గురువారం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. 46 దేశాల ప్రపంచ స్టాక్ సూచీ ఎంఎస్‌సిఐ రికార్డు స్థాయి గరిష్టం 0.3 శాతం పెరిగి 464.38 పాయింట్లకు చేరింది. ఎంఎస్‌సిఐ ఆసియా సూచీ 1 శాతంతో రెండేళ్ల గరిష్టానికి చేరడంతో ఆసియన్ స్టాక్స్ కూడా బలంగా ట్రేడ్ అయ్యాయి. బుధవారం ప్రారంభంలో అమెరికా ఎస్ అండ్ పి 500 సూచీ కూడా రికార్డు స్థాయి గరిష్టంలో ముగిసింది.
డెరివేటివ్స్ గడువు
దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు తేదీ గురువారంతో ముగిసింది. దీంతో గడువుకు ముందు షార్ట్ కవరింగ్‌తో దేశీయ ఈక్విటీల్లో ర్యాలీ వచ్చింది. మే డెరివేటివ్స్ గడువు ముగియడం.. తర్వాత నెల ప్రారంభం కావడం మార్కెట్ పరిస్థితులను మార్చి వేసింది.
క్యూ4 ఫలితాలు
2016-17 మార్చి 31 ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో పలు సంస్థలు మంచి లాభాలను నమోదు చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసివచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ఐటీ కంపెనీలు రాణించాయి.
విదేశీ పెట్టబడులు, రూపాయి
విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టబడుల ప్రవాహం కొనసాగుతుండడం కూడా మార్కెట్‌కు సానుకూలంగా మారింది. ఈక్విటీ, డెబిట్ మార్కెట్లకు వారి సహకారం మెండుగా ఉండడం కలిసివచ్చింది. మే నెలలో ఇప్పటివరకు ఈక్విటీ, డెబిట్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐ, డిఐఐలు వరుసగ రూ.7,859 కోట్లు, రూ.15,963 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు పెరిగి 64.48 వద్ద కొనసాగుతోంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 64.58గా ఉంది.
టాప్ స్టాక్స్
చాలా వరకు స్టాక్స్ మంచి లాభాలను ఇచ్చాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 శాతం పెరిగి రూ.1,613 వద్ద ముగియగా.. అలాగే ఎల్ అండ్ టి 4.8 శాతం పెరిగి రూ.1,765, ఐసిఐసిఐ బ్యాంక్ 3.3 శాతం పెరిగి రూ.316.85, మారుతీ సుజుకీ 1.5 శాతం పెరిగి రూ.6,970, హిందుస్తాన్ యునిలీవర్ 0.7 శాతం పెరిగి రూ.1,045, ఐటిసి 0.4 శాతం పెరిగి రూ.301కు చేరాయి. ఇవి 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఇంకా ఇన్ఫోసిస్ 2.7 శాతం పెరిగి రూ.981 పాయింట్ల వద్ద ముగిసింది.

Comments

comments