Search
Wednesday 26 September 2018
  • :
  • :

స్టాక్ మార్కెట్లు :వరుస నష్టాలతో కుదేలవుతున్న మదుపరులు..!

stock-markets-image-doneముంబయి : గత 10 రోజుల నుంచి వరుసగా మందుపరులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్న స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి 25,269 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 7,713 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.26 వద్ద కొనాసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ షేర్లు అత్యధికంగా 3.98 శాతం లాభపడి రూ. 152.85 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐటిసి, ఎసిసి, బిహెచ్‌ఇఎల్, ఎల్ అండ్ టి సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే బాష్ సంస్థ షేర్లు అత్యధికంగా 4.26శాతం నష్టపోయి రూ. 19,900 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఐడియా, టిసిఎస్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

Comments

comments