Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెరుగుతున్న రాళ్లు

Stones Size Increased in Beach

కొత్తకొత్త వింతలు, విడ్డూరాలు మనం చూస్తూ ఉంటాం. న్యూజిలాండ్‌లోని మోరికీ అనే ఊరికి ఆనుకుని ఉన్న బీచ్‌లో కొన్ని మిలియన్ ఏళ్ళక్రితం ఏర్పడిన పెద్ద బంతి ఆకారంలో ఉన్న రాళ్ళు ఉన్నాయి. దాదాపు 19 కిలోమీటర్ల మేర ఈ రాళ్ళు కనిపిస్తాయి. ఇవి గుండ్రంగా, దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.  ఇక్కడున్న రాళ్ళలో అతి పెద్దది సుమారు 40 లక్షల ఏళ్ళక్రితం ఏర్పడిందట. ఇప్పటికీ అది ఎదుగుతూనే ఉంది.

అసలు ఈ బీచ్‌లో ఇంత పెద్ద రాళ్లు ఏర్పడటానికి కారణాలు ఏమిటా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అవి నిజమైనవి కావని, సముద్రంలోని బురద, మెత్తటి ఇసుకల మిశ్రమంతో ఏర్పడ్డవే ఈ రాళ్లు  తెలుసుకున్నారు. బురద,మట్టి కొంచెం పైకి వచ్చి మేట వేయటంతో ఇవి ఏర్పడుతున్నాయిట. వాటిల్లో ఉండే కాల్సైట్, ఇనుము, మెగ్నీషియం వంటివాటివల్ల ఇవి గట్టిగా , గుండ్రంగా తయారవుతున్నాయి.ఇక్కడ ఇలాంటి రాళ్లలో 50లక్షల ఏళ్ల క్రితంవీ ఉన్నాయిట. ఉదయం , సాయంకాలాల్లో  సూర్యకాంతి ఈ రాళ్లపై ప్రసరించి అందంగా ఉంటుంది. దృశ్యాలు అందంగా కనిపిస్తాయిట. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని పర్యాటకులు చెబుతున్నారు.

Comments

comments