Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఈ అక్రమం ఆగదా?

దేశ విదేశాలదాక సాగుతున్న బియ్యం అక్రమ రవాణా!
ప్రభుత్వం అందిస్తున్న సరుకులు పక్కదారి!
నామమాత్రపు దాడులతోనే సరిపెడుతున్న అధికారులు
సత్తుపల్లి, కొణిజర్లలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

Untitled-1ఖమ్మం: నిన్న మొన్నటి వరకు ఏన్కూరులో 220 క్వింటాళ్లు, అర్బన్‌లో 160క్విం టాళ్లు, పినపాక, ఖమ్మం, చింతకానిలో పట్టుబడిన రేషన్ బియ్యం శనివారం సత్తుపల్లి, కొణిజర్లలో పట్టుబడ్డాయి. ఇలా ఎక్కడో చోట అక్రమ రేషన్ బియ్యం పట్టుపడుతూనే ఉన్నాయి. లారీలకు లారీల బియ్యం సరిహద్దులు దాటి ఇతర ఖండాలకు అక్రమంగా తరలిపోతున్నా అరికట్టలేక పోతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కళ్లుగప్పి వందల క్వింటాళ్లలో తరలిస్తున్నారు. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కాకినాడ పోర్టు వరకు ఓ పెద్ద వ్యవస్థ ఏర్పాటైందని ఆరోపణలు వినవస్తున్నాయి. అడపా, దడపా దాడులతో సరిపెడుతుంది అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో నిఘా ఉంచితే పెద్ద స్థాయిలో బియ్యం రవాణా బట్టబయలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో రేషన్ డీలర్ల వద్ద నుంచి బియ్యం కొనుగోలు చేయడం ఒక పద్దతి. రెండో పద్ధ్దతిలో తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారి వద్ద నుండి కొనుగోలు చేయడం, కొందరు రేషన్ డీలర్లు రేషన్ ఇవ్వకుండానే కిలోకు ఐదు నుంచి ఆరు రూపాయల చొప్పును కొనుగోలు చేస్తున్నారు. వాటిని వేరే బస్తాలలో నింపి అక్రమార్కులకు విక్రయిస్తున్నారు.

ఇక గ్రామ గ్రామాన కూరగాయలు అమ్మినట్లు, పాత ఇనుము, పాత సామాన్లు కొన్నట్లు మోటారు సైకిళ్లపై, మోపెడ్లపై, ఇంటింటికి తిరిగి కిలో 8 నుంచి 10 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. వీటిన్నంటిని ఒకచోట చేరుస్తున్నాయి. కోళ్ల పెంపకం కేంద్రాలు, బయట వ్యాపార బోర్డులు తగిలించి లోపల బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. అక్కడి నుండి లారీల ద్వారా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు లేదా మరేవరైనా అడ్డగించితే అయితే దానం లేదంటే దండోపాయం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి చిల్లరగా కొనుగోలు చేసిన బియ్యాన్ని కూడా ఖమ్మంలోని నిల్వ కేంద్రాల్లో దాచి విదేశాలకు తరలిస్తున్నారు. మండల లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి కూడా నేరుగా లారీలలో తరలిస్తున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో మరో అక్రమం చోటు చేసుకుంటుంది.
బస్తా ఒక్కొంటికి కేజీ నుం చి మూడు కేజీల వరకు తీస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. ఇలా తీసిన బియ్యాన్ని బస్తాలలో నింపి అక్రమార్కులకు విక్రయి స్తున్నారు. తరలిపోతున్న బియ్యంలో కొంత శాతమే పట్టుబడు తోంది. స్బిబంది కొరత, కొందరి పరోక్ష సహకారం అక్రమా ర్కులకు కలసి వస్తుందని సర్వత్రా ఆరోపణలు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే తప్ప ఈ అక్రమాన్ని అరికట్టడం కష్టమే.

Comments

comments