Home మహబూబాబాద్ పోలీసుల దిగ్బం ధంలో మానుకోట

పోలీసుల దిగ్బం ధంలో మానుకోట

car

*ఆత్మగౌరవ సభలతో ఉలికిపడ్డ పట్టణ కేంద్రం
*144 సెక్షన్ అమలు
*ఎక్కడికక్కడే లంబాడీ నాయకుల అరెస్టులు

మన తెలంగాణ/మహబూబాబాద్ టౌన్ : పోలీసుల దిగ్బంధంతో మానుకోట జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలికిపడింది. పోలీసుల అనుమతి లేనప్పటికీ ఎస్టీ లోని రెండు తెగలు లంబాడ, ఆదివాసులు ఒకేరోజు జిల్లా కేంద్రంలోని స్థానిక గాంధీపార్కు నందు ఆత్మగౌరవ సభలను నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో ఎలాంటి అసాంఘీక శక్తులకు తావివ్వకుండా అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉన్నందున మానుకోట జిల్లా కేంద్రం ఆదివారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 144 సెక్షన్‌ను అమలు చేసారు. దీంతో జిల్లా కేంద్రంలో ఏక్షణాన ఏంజరుగుతుందోనని జిల్లా వాసులు ఉత్కంఠంగా ఎదిరి చూశారు. కోర్టు సెంటర్, మూడుకోట్ల సెంటర్, గాంధీ పార్కు, నెహ్రూ సెంటర్, శ్రీనివాస సెంటర్, అండర్ బ్రీడ్జి, రైల్వే స్టేషన్, బస్టాండ్ , బైపాస్, మార్కెట్ సెంటర్, వివేకనందా సెంటర్‌లలో పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. సభలను జరుపుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వమని ముందస్తుగా ఎస్పీ హెచ్చరించినప్పటికీ, ఆ హెచ్చరికలను నిరాకరించి ఆత్మగౌరవ సభలను విజయవంతం చేయాలనే ఉద్దేశ్యంతో లంబాడీలు, ఆదివాసులు జిల్లా కేంద్రానికి బయలు దేరడంతో పోలీసులు ఎక్కడివాళ్లను అక్కడే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌లలో నిర్భందించారు. స్థానిక పత్తి పాక నుండి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ కొంతమంది గిరిజనులు రావడంతో పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఆప్రదేశంలో ఏంజరుగుతుందోనని ఉత్కంటనెలకొంది. అయినా పోలీసులు ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. మండంలోని జమాండ్లపల్లి గ్రామంలో ఆదివాసులను పోలిసులు అరెస్టు చేశారు. భూక్య ప్రవీణ్ నాయక్, భీమా నాఆయక్, బోడ లక్ష్మణ్, స్వామినాయక్, భాస్కర్ నాయక్, మూడు బాలు చౌవన్, మోతిలాల్, వెంకన్న, రాందాస్, హరిలాల్, బానోత్ రవి కుమార్, తదితరులు ఉన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఆందోళన
ఆత్మగౌరవ సభకు తరలి వస్తున్న గిరిజనులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరళించడంతో గిరిజన నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే అందోళనలు చేపట్టారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాటాలు చేపట్టడానికి వెనకడుగు వేసేది లేదన్నారు. పోలీసుల నిర్భందాలు తమను ఆపలేవని తేల్చి చెపారు. అరెస్టులకు బయపడేది లేదన్నారు.
సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే కవిత
అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్భందించిన గిరిజన నాయకులను మాజీ శాసన సభ్యురాలు మాలోత్ కవిత సంఘీభాం తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవ కాపాడుకునేందుకు తానుకూడా అండగా ఉంటానని హాచ్చారు. సంఘీభావం తెలిపిన వారిలో గుగులోత్ కిషన్ నాయక్, రఘువీర్ రాథోడ్, మోతిలాల్ , తదితరులు ఉన్నారు.
ఫలించిన పోలీసుల హ్యుహం…
లంబాడ, ఆదివాసుల ఆత్మగౌరవ సభలను అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు పలించాయి. ఉదయం 4గంటల నుండే రహదారులను తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల గస్తీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా లంబాడీలను 219 మంది, ఆదివాసులు 85 మంది ని మొత్తం 304 మందిని పోలీసులు అరెస్టు చేశారు.