Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చుట్టపు కొంగలు బారులు బారులు

Storks

సైకత భూముల అతి పెద్ద సరస్సు సాంబార్ సాల్ట్ లేక్‌కు ఆగస్టు నెల అతిధులుగా రాజహంసలు అరుదెంచాయి. రాజస్థాన్ జైపూర్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని ఈ అతి పెద్ద సరస్సుకు రాజసం ఒలికించే కొంగల గుంపులు తరలిరావడంతో ఈ జలాశయం అందాలు ఇనుమడించాయి. అవి గంభీరంగా రాజరికపు హొయలు ఒలికిస్తూ దూర ప్రాంతాల నుంచి తరలివచ్చాయి. ఈ నెల 3వ తేదీ శుక్రవారం నుంచి ఈ ఫ్లెమింగోల గుంపు తమ ప్రతి ఏటి విడిదికి యధావిధిగా దూసుకువచ్చాయి. నీళ్లలో తిరుగాడుతూ చేపల వేటలో పడ్డాయి.

వాటిని చూసేందుకు వస్తున్న పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా సందడిగా మారింది. వందలాది మంది ఈ జీవులను తమ కెమెరాలలో తమ సెల్‌ఫోన్లలో క్లిక్ మన్పిస్తూ  జ్ఞాపకాలను పదిలపర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో వెలిసిన అక్రమ ఇసుక తయారీ యూనిట్లు వెదజల్లుతున్న కాలుష్యం దెబ్బకు గత కొద్ది దశాబ్ధాలుగా ఈ సరస్సుకు ఈ హంసలు రావడం తగ్గిపోతూ వచ్చింది. సరస్సు చుట్టూ ఉన్న ఇసుక తవ్వకాలు, సరస్సు విస్తీర్ణం కుంచించుకుపోవడంతో పాడైపోయెను ఈ గూడు అనుకుంటున్నాయో ఏమో ఈ ప్రాణులు ఇటువైపు మొహం చాటేశాయి.

Comments

comments