Home ఆఫ్ బీట్ గ్రామర్ మారుతున్న గ్లామర్

గ్రామర్ మారుతున్న గ్లామర్

Cinema-Field

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఒకప్పుడు డ్రగ్స్‌కు బానిస. అతను మత్తు పదార్థాలకు బానిసగా మారి కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఆ డ్రగ్స్ పుణ్యమా అని మాఫియాతో లింకులేర్పడ్డాయి. అవి కాస్తా టెర్రరిస్టులకు అనుకూలంగా మారాయి. ఫలితంగా సంజయ్‌దత్ టాటా చట్టం కింద బుక్కయి జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చింది. సంజయ్‌దత్ జీవితం ఎవరికైనా గుణపాఠమే. డ్రగ్స్ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయని సంజయ్‌దత్ చెబుతుండేవాడు. ఇక సంజయ్‌దత్ బయోపిక్‌లో సంజయ్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్‌కు సైతం చిన్నప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడట. స్కూల్ డేస్‌లోనే రణబీర్ డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. ఆతర్వాత అది తప్పని తెలుసుకున్నాడట. అంతేనా సినీ నటుడిగా మారాక కూడా డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని రణబీర్ కపూర్ స్వయంగా చెప్పాడు.

ఈసారి మాత్రం సినిమా కోసమే తీసుకోవాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు. ‘రాక్‌స్టార్’ సినిమా కోసం డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని పెద్ద బాంబు పేల్చాడు ఈ యంగ్ హీరో. తన తాజా చిత్రం ‘జగ్గా జాసూస్’ ప్రమోషన్స్‌లో భాగంగా రణబీర్‌కపూర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోపక్క డ్రగ్స్ గురించి అతను పనిగట్టుకొని మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. సినిమా కోసం డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరమేంటి..? ఆ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడం అవసరమా అని పలువురు బాలీవుడ్ ప్రముఖులు విమర్శించారు. అయితే సినిమా కోసం ఒక్కోసారి రిస్క్ చేయాల్సి ఉంటుందని… ‘రాక్‌స్టార్’ సినిమా కోసం తక్కువ మోతాదులో, తక్కువ తీవ్రత గల డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనుకున్న సన్నివేశం అనుకున్నట్లుగా వచ్చిందని రణబీర్‌కపూర్ చెప్పాడు. తెలుగు సినీ రంగంలో డ్రగ్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ… ఓ బాలీవుడ్ హీరో తనకు ఒకప్పుడు డ్రగ్స్ అలవాటు ఉండేదని  చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

సినీ ఇండస్ట్రీకి, డ్రగ్స్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలీవు డ్ నటుడు సంజయ్‌దత్ మీద అప్పట్లో చాలా ఆరోపణలే వచ్చాయి. చాలా మంది బాలీవుడ్ నటులు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుపోయారు. తేలిగ్గా తప్పించుకున్నారు కూడా. ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించి సౌత్ సినీ పరిశ్రమ తక్కువేమీ తినలేదు. అందునా టాలీవుడ్ కూడా ఈ డ్రగ్స్ మేనియాకు మినహాయింపు కాదు. కొన్నేళ్లక్రితమే రవితేజ సోదరుడు భరత్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు కూడా. ఆసక్తికరమైన విషయమేమిటంటే డ్రగ్స్ తీసుకునే వారితో పాటు డ్రగ్స్ కొరియర్లు కూడా కొందరు చిత్ర పరి శ్రమలోఉన్నారని తెలియడం. అయితే “కొందరి కారణం గానే సినీ పరిశ్రమపై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. కొం దరు డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వాస్తవమే. ఇటువంటి వారితో టాలీవుడ్‌కు చెడ్డపేరు వస్తోంది”అని ప్రముఖ నిర్మాత లు అల్లు అరవింద్, సురేష్‌బాబు ఆవేదన వ్యక్తంచేశారు.

అనుకోకుండా అలవాటు….
చిత్ర పరిశ్రమలో కొందరు అనుకోకుండా డ్రగ్స్ బారిన పడుతున్నారు. అలా డ్రగ్స్‌కు ఓసారి అలవాటైతే వాటిని వదిలించుకోవడం కష్టం. అదే సమయంలో డ్రగ్స్‌ను అల వాటు చేసుకున్న వారిలో కొందరు కొరి యర్లుగా కూడా మారుతున్నారని తెలిసింది. సినీ రంగంలోని కొందరికి షూటింగ్ పూర్తయిన తర్వాత రాత్రిపూట స్నేహితులు, సన్నిహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం అలవాటు. పబ్‌లు, స్టార్ హోటళ్లలో జరిగే పార్టీలకు కొందరు తరచు గా హాజరవుతుంటారు. అయితే పార్టీల్లో మద్యం సేవించ డంతోనే ఆపేయకుండా కొందరు అనుకోకుండా డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. ఇటువంటి పార్టీలలో సినీ రంగంలోని వారితో పాటు రాజకీయ, వ్యాపార రంగాల కు చెందిన వారు కూడా హాజరవుతుంటారు. కొన్నిసార్లు ఇటువంటి పార్టీలలో ఈవెంట్ నిర్వాహకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రేవ్ పార్టీలలో మత్తు పదార్థాల సరఫరా జరిగేదని సమా చారం. అయితే ఒకసారి డ్రగ్స్ తీసుకున్నవారు ఆ అలవా టును మానుకోలేక తరచుగా మత్తు పదార్థాలు తీసుకుం టూ వాటికి బానిసలుగా మారుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమపై ‘డ్రగ్స్ మేఘాలు’ కమ్ముకున్న వేళ కొందరు సినీ ప్రముఖులు చెబుతు న్న నీతులు అందరినీ విస్మయానికి గురిచేస్తు న్నాయి. రాత్రికి రాత్రి వచ్చేసే స్టార్‌డమ్ కార ణంగా వచ్చే డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియక యువ నటీనటులు డ్రగ్స్‌ను ఆశ్రయిస్తారనీ… తాము పడ్డ కష్టంతో పోల్చితే ఇప్పుడు యువతరం పడుతున్నది అసలు కష్టమేకాదన్నది వారు చెబుతున్న మాట.

చాలామంది యువన టులు రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సంపా దిస్తున్న మాట వాస్తవం. వారి రెమ్యునరేషన్ లక్షల నుంచి కోట్లకు పడగలెత్తుతున్న మాట కూడా వాస్తవమే. కానీ మత్తు పదార్థాలను ఎంత మంది ఆశ్రయిస్తున్నారు..? మహా అయితే వేళ్ల మీద లెక్కబెట్టగల స్థాయిలోనే ఉండొచ్చు. అయితే ‘కంచె చేసు మేస్తే… దూడ గట్టున మేస్తుందా..?’ అన్న చందాన కొందరు సీనియర్లు చూపిన బాటలోనే యువతరం నడుస్తోందన్నది ఇంకో వాదన. గతం లోనూ డ్రగ్స్ విషయమై టాలీవుడ్‌పై ఆరోపణలు వచ్చాయి. అప్పుడెవరూ ఈ ఆరోప ణల్ని అంత సీరియస్‌గా తీసుకో లేదు. రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌తో దొరికినవారినీ, ఇతరత్రా అసాంఘీక కార్యకలా పాల్లో బుక్ అయినవారినీ తిరిగి చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చి వారికి అవకాశాలి స్తుండ డంతోనే ఈ దుస్థితి దాపురిస్తోందన్నది నిర్వివా దాంశం. ‘ప్రభుత్వమెలాగూ కఠిన చర్యలు తీసుకుం టుంది. మేం కూడా అలాంటి అక్రమార్కులపై ఇండస్ట్రీపరంగా ఉక్కు పాదం మోపుతాం…’ అంటూ మీడియా ముందు హడావిడి చేస్తున్నవాళ్లకు తెలియదా టాలీవుడ్‌లో ఎవరెవరికి డ్రగ్స్‌తో లింకులున్నా యోనని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. పలుకు బడి ఉంటే ఏదీ బయటకు రాదు. నయీం ఎన్‌కౌంటర్ సమయంలో ఇంతకన్నా భయంకరంగా చాలా మంది పేర్లు బయటకు రాగా… మెషిన్లతో డబ్బులు లెక్కించారని వినిపించినా… ఇప్పుడు ఆ కేసు ఏమయింది? ఏ స్థితిలో ఉంది? ఎవరికైనా తెలుసా అనే ప్రశ్నలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి.

ఫలానా అధికారి ఉన్నారని, ఫలానా పెద్ద తలకాయలు ఉన్నాయని అప్పట్లో మీడియా తెగ హడావిడి చేసింది.. ఇప్పుడు చేసినట్లే. అందువల్ల ఈ డ్రగ్స్ కేసు కూడా కొన్నాళ్ల తర్వాత చల్లారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా డ్రగ్స్ వ్యవ హారంలో ఉన్నదంతా ఆంధ్ర జనాలే కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీలయినంత స్మూత్‌గా డీల్ చేసే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. ఆంధ్రవాళ్ల ను టార్గెట్ చేస్తున్నారన్న టాక్ రాకూడదని… అలాగే టాలీవుడ్ జనాలు ఇక్కడ సురక్షితం కాదు, ఆంధ్రకు సినీ ఇండస్ట్రీని తీసుకువెళ్లాలన్న ఆలోచన చేయకూడదని, వీలైనంత పకడ్బందీగా దర్యాప్తు సాగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ‘హైదరాబాద్ లోని కొందరు యువతీయువకులు మత్తులో జోగుతున్నా రు. కార్పొరేట్ విద్యా సంస్థల్లోని విద్యార్థులు కొందరు డ్రగ్స్‌కు బానిసలైపోయారు. తెరవె నుక ఈ తతంగాన్ని నడిపిస్తున్నది కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలే’… ఇలా మొదలైంది హైదరా బాద్‌లో డ్రగ్స్ వ్యవహారం. అనూ హ్యంగా ఈ వ్యవహారం చిత్ర పరిశమ్రకు లింక్ అయింది. అప్పటిదాకా కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈసారి ఫోకస్ సినీ ఇండస్ట్రీపై పెట్టారు. అంతకు ముందు వెలుగు చూసిన ‘కార్పొరేట్ డ్రగ్ మాఫియా’ వ్యవహారం ఏమైందో ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఇప్పుడంతా ఫోకస్ టాలీవుడ్‌పైనే కనిపిస్తోంది.

హైదరాబాద్ అంటే ఐటి, సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు. ఇండస్ట్రియల్ హబ్ కూడా. సినిమా జనాలను నిలబెట్టి కొనగల బడా బాబులు ఎందరో హైదరాబాద్ బిజినెస్, ఇండస్ట్రీ సర్కిల్‌లో ఉన్నారు. వాళ్ల పిల్లలది కూడా హై ఫై వ్యవహారమే. ఇక పొలిటికల్ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే చాలా మంది సినిమా వాళ్ల పిల్లలకు ఈ బిజినెస్, ఇండస్ట్రీ, పొలిటికల్ సర్కిల్ పిల్లలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్లంతా బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు, పార్టీలకు వెళ్లడం చాలా కామన్. కానీ చిత్రంగా ఎక్సైజ్ శాఖకు దొరికిన రకరకాల కాల్ లిస్టులలో సినిమా జనాల ఫోన్ నెంబర్లు, కాల్ డేటా ఉన్నట్లుంది తప్ప… సదరు పొలిటికల్, ఇండస్ట్రియల్ జనాల కాల్ డేటా ఉన్నట్లు కానీ.. అలా వున్న వాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు కానీ ఎక్కడా వినిపించలేదు. సినిమా వాళ్లకు నోటీసులు ఇచ్చామని చెప్పిన ఎక్సైజ్ అధికారులు… మరేమీ చెప్పలేదంటే రాజకీయ నాయ కులు, బడా బాబుల పిల్లలు ఎవరూ లేని అన్యాపదేశంగా చెప్పినట్లే.

-ఎస్.అనిల్ కుమార్