Home దునియా ఆయన మట్టీ ఆకాశం జానపద జావళి గీతం

ఆయన మట్టీ ఆకాశం జానపద జావళి గీతం

CM KCR Condole to Singireddy Narayana Reddy in Telangana

ఆయన ఆ ఊరి జానపదాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. జాన పదమే ఆయనకు జ్ఞానపీఠం అధిరోహింపచేసింది. మహత్తర కవి సి.నారాయణరెడ్డి లేరనే వార్త హన్మాజిపేట సుట్టుముట్టు ఊర్లు సిరిసిల్ల ఏములవాడ కరీంనగర్ అంతా తల్లడిల్లినయి. పల్లెపదాల సౌరభాలను సినారె పుక్కిట పట్టి గేయల్లో మెరిపించిం డ్రు 1931 జులై 29వ తేదీన పుట్టిన సినారె పదమూడో ఏటనే పద్యం రేసిండు. ‘ఇదేందిర మెద డు కరాబు అయితది’ అని తండ్రి హెచ్చరించినా ఇనకుండా ఊరూర తిరిగి పద్యాలకు లయత్మకంగ పాడి ఇన్పించేటో డు. అట్లనే ఆయన ఒగ్గు కథ బుర్రకథ హరికథల గానాలను ఎంటపడి నేర్సుకున్నడు హన్మజిపేట, ఎము లాడ సుట్టుపక్క ల కథలు చెప్పేటోల్లతానికి పోయి అవన్ని ఆసక్తిగ ఇన్నడు అందు వల్ల ఎవుసం చేసుకబతికే రెడ్డి బిడ్డ అయిన ఆయనకు సంగీతం లయ మీద అక్షరాల మీద మక్కువ కల్గింది. ఏము లాడ రాజన్న తన పండితుల సోపతులతో అది మరింత ముదిరి ఊల్లె పదాలు రాసి మక్కజొన్న చేన్ల బాగ సదివి ఇన్పిచేచదని ఆయన సాయెత గాల్లు సెప్పిండ్రు. అక్కన్నుంచి మొదలైంది సాహిత్య ప్రస్థానం. హన్మజిపేట నక్కవాగు నుంచి ప్రయాణం జాతీయస్థాయి కీర్తి కిరీటం కలికితు రాయిగా మారింది.

సినారె రాస్తూ రాస్తూ మరణిస్తాను అని ఆయన చనిపోయే వరకు కవిత్వం రాసిండు. చివరకు జూన్ 12న సోమవారం పేజీలో ‘మనతెలంగాణ’ కలం పేజీలో ఒక కవిత అచ్చయింది. అదే ఆయన చివరి కవిత కావచ్చు. కవిత్వం రాయనిదే నిద్ర పోని మనిషి ఎవరికీ తలవంచని కవి సి.నారాయణరెడ్డి. ఆయన గొప్ప పరిశోధకుడు విమ ర్శకుడు అనువాదకుడు పరిపాలనాదక్షుడు మంచి ఆధ్యాప కుడు మీదు మిక్కిల నిబద్ధతగల వ్యక్తి. తెలుగుదనం రైతు తనం కనపడే ఎత్తైన రూపం. సినారె పాఠం వినడానికి ఆర్ట్ కాలేజీకి సైన్స్ విద్యార్థులు కూడా పోయేవారు. ఆయన పొందని పదవి, పురస్కారం లేదు. పోతన కడప జిల్లా ‘ఒంటిమిట్ట’వాడు అని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అవతల వైపు ప్రచారం చేస్తే లేదు లేదు ఆయన వరంగల్ జిల్లా బమ్మెరకు చెందిన వాడు అని ట్యాంక్‌బండ్ మీద పోతన విగ్రహం ముందు నిగ్గుతేల్చారు. తెలంగాణ ఉద్యమంలో బాహాటంగా బయటికి రాకున్నా తెలంగాణ పట్ల పాణం కొట్టుకునేది ఒక సభలో అందరు జై తెలంగాణ అంటే తాను ‘సై తెలంగాణ’ అంటా అని అన్నారు.

సాహిత్యంతో తనది మానవతా ప్రగతిశీలవాదమనే ఎన్నోసార్లు చెప్పు కున్నరు. నారాయణరెడ్డి ప్రాచీన సంప్ర దాయలు తెలిసిన ఆధునిక కవి. ప్రయో గకర్త ప్రపంచ పదు ల్లో “మానవతావాదం” నేపథ్యంగా రాశారు. తెలుగు గజల్స్ ఆయన పెట్టింది పేరు గజల్స్ గేయలు రాయడమేగాక ఆయన స్వయంగా పాడే వారు. ఆయనకు శ్రావ్యమైన గొం తు ఉండటం వల్ల గేయ కవిత్వం సృష్టించారు. మీదు మిక్కిలి తెలుగు చలన చిత్ర ప్రపంచాన్ని అవతల పక్కవాల్లు ఇప్పటికే ఏలుతున్న నేపథ్యంలో మన సినారె 3500 పాటలకు పైగా రాసి మహాకవి అనిపించుకున్నారు. సమయపాలన అంటేనే సినారెకు అత్యంత ఇష్టమైంది. ఏ సభలు సమావేశాలకు అయినా ఆయన కరెక్ట్ టైంకు వెళ్లే వారు. ఎవరు వచ్చినా రాకున్న ఆ సమయంలోనే పూర్తి చేయించేవాల్లు. ఆయన కోసం సభ ఎదిరిచూడటంకాని ఆయన ఎవరికోసమైన ఎదిరిచూడటం అనేది జరుగలేదు. ఆయన, దాశరథి తెలంగాణ రచయితల సంఘంకు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేశారు. ‘సాహితీ సోపతి’ సంస్థ ఆధ్వ ర్యంలో త్యాగరాయగానసభలో యం.నారాయణశర్మ అస్తి త్వ పుష్పాలు ఆవిష్కరణ సభలో ఆయన ‘సోపతి’ అనే పదంపై వివరణమైన విశ్లేష ణ చేశారు.

సోపతి ‘సొహబత్’ అనే ఉర్దూ నుంచి వచ్చిందని సోపతి, సోపతి గాళ్ళం అనే పదబంధాలను వివరించారు. యువ కవులతో పోటీపడి 86 ఏళ్ల వయసులో కూడా కవిత్వం రాస్తున్న కవి. ప్రతి జులై 29రోజు సినారె పుట్టినరోజు ఆయన కొత్త కవితా సంకలనం రావల్సిందే. రానున్న జులై 29 కోసం డిటిపి పనిపూర్తి కావ స్తున్న తరుణంలో తుదిశ్వాస విడవడం తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది. 2010లో చివరిసాగ ఆయిన ‘మరణంపైనే నా రణం’ అనే సంకలనం విడుదల చేశారు మరణంపై రణం చేసి దానితో ఓడిపోయారు. కొత్త గా కవిత్వం రాస్తున్నట్టుగానే తాజాగా ఉంటారు ఆయన ఎవరైనా పుస్తకం పంపిస్తే తప్పనిసరి గా దానికి జవాబు గా మరో ఉత్తరం రాసి అందులోని వాక్యాలు ఉటకిం చేవారు. తాను రాసి న పుస్త కాలు కూడా తన సంతకంతో పంపిం చే వారు. ఆయన తెలుగు సాహిత్యం లో ఒక పెద్ద ఊడల మర్రిచెట్టు. ఆ చెట్టు నేల రాలింది అయినా ఆ మర్రి ఇత్తునాలు తిరిగి తిరిగి మొలకెత్తుతున్ని సినారె మట్టి మనిషి సినారె జానపదుడు సినారె ఆకాశం.

-అన్నవరం దేవేందర్, 9440763479