Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఈ చిన్నారి ఫోటో ప్ర‌పంచాన్ని క‌లిచి వేస్తోంది!

USA

వాషింగ్టన్: మెడిటరేనియన్ బీచ్‌లో 3 సంవత్సరాల అయ్లాన్ కుర్ది అనే బాలుడు విగతజీవిగా పడి ఉండటం అప్పట్లో అందరి హృదయాలను కలచివేసింది. అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియా దుస్థితికి ఫోటో అద్దం పట్టింది. ఇప్పుడు అటువంటిదే మరో ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారుతోంది. అమెరికా, మెక్సికో సరిహద్దులకు సంబంధించిన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరికి ఇప్పుడు ఈ ఫోటోనే నిదర్శనంగా మారింది. అందులో ఓ రెండేళ్ల హోండురస్‌కు చెందిన చిన్నారి ఏడుస్తూ కనిపిస్తుంది. అక్రమంగా సరిహద్దులు దాటుతున్న వారి నుంచి వాళ్ల పిల్లలను అమెరికా బోర్డర్ పాట్రోల్ బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీస్తుంది. ఇలా ఇప్పటికే 2000 మంది పిల్లలు తమ కన్న తల్లిదండ్రులకు దూరం చేసింది. ఈ రెండేళ్ల బాలిక ఫోటోను పులిట్జర్ అవార్డు విన్నర్ జాన్ మూర్ తీసింది. ఆ బాలిక కన్నీరు మున్నీరవుతున్న సమయంలో పక్కనే చిన్నారి తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. ఆ సందర్భంలో తాను తీసిన ఫోటోలు తనను కంటతడి పెట్టించాయని జాన్ మూర్ ఆవేదన వ్యక్తం చేసింది. యుఎస్ లోని దక్షిణ సరిహద్దులో అక్రమ వలసలను అడ్డుకోవడానికి 2 వేల మంది చిన్నారులను తల్లిదండ్రులకు దూరం చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారులు కన్నీరు పెడుతున్న ఆడియో టేపులు వైరల్‌గా మారుతున్నాయి. ఏప్రిల్ మధ్య నుంచి మే చివరి వరకు 1940 మంది తల్లిదండ్రుల నుంచి 1995 మంది చిన్నారులను వేరు చేసినట్టు డిపార్ట్‌మెంట్ ఆప్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది.

Comments

comments