Home జాతీయ వార్తలు ఒక ఊరి(బీహార్) కథ

ఒక ఊరి(బీహార్) కథ

story-of-Hehlar-villageప్రముఖ దర్శకుడు కేతన్ మెహతా నిర్మించి దర్శకత్వం వహించిన దశరథ్, ద మౌంటెయిన్ మ్యాన్ చిత్రం ఊహించని రీతిలో హిట్ అయింది. బీహార్‌లోని గయ ప్రాంతానికి సమీపంలో ఉన్న హెహ్లార్ గ్రామానికి దారి కోసం దశరథ్ తన జీవితకాలం అంతా ఒక పర్వతాన్ని తొలుస్తూనే గడిపాడు. చిత్రం కథాంశం ఇంతే… అయినా అది బ్రహ్మాండంగా విజయవంతమైంది. అయితే అదే దశరథ్ అధికార పర్వతాన్ని తొలిచేందుకు ప్రయత్నించి ఉంటే ఏమయ్యేది?… ఒక్క తుపాకీ గుండు దెబ్బకు బలయ్యేవాడు.

భజన్‌పురిలో జరిగింది అదే…
ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్‌లో భజన్‌పురి ఒక చిన్న గ్రామం. ఫార్బిస్‌గంజ్ టౌన్‌కు చాలా సమీపంలో ఉంది ఇది. నాలుగేళ్ళ క్రితం జూన్ 3న ఈ గ్రామ ప్రజానీకం అక్కడ రోడ్డుకు అడ్డంగా ఒక పారిశ్రామికవేత్త నిర్మించిన ప్రైవేట్ కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. మన దేశం లో నిరసనలు తెలియజేయటం రాజ్యాంగ ఉల్లంఘన కాదు, రాజద్రోహం అంతకన్న కాదు… అయినా పోలీసులు వచ్చేశారు. ఉన్నపళంగా నలుగురు అమాయకులు వారు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొం దరు తీవ్ర గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో 20 సంవత్సరాలు కూడా దాటని ఇద్దరు యువకులు, ముగ్గురు పిల్లల తల్లి, పది నెలల పసిపాప ఉన్నారు. ఇదంతా ఇప్పుడు బీహార్‌లో మహాకూటమికి నాయకత్వం వహి స్తున్న నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది. బిజెపితో జట్టు కట్టిన సమయం అది. ఇంత జరిగినా నితీశ్ తమ గ్రామానికి రాలేదన్న ఆగ్రహం గ్రామస్థుల్లో వ్యక్తం అవుతోంది. ఈసారి నితీశ్‌కు ఓటు వేయబో మని, అయితే మహాకూటమికి మాత్రం వేస్తామని ముస్తఫా తండ్రి అంటు న్నాడు. చూస్తూ చూస్తూ బిజెపిని గెలిపించలేమని, ఇది మినహా మరో మార్గం లేదన్నాడు అన్సారీ.

కళ్ళ ముందే…
ఈ ఘటనను విడియో తీశారు. దీన్ని ఇప్పుడు సర్కార్ బ్లాక్ చేసినప్పటికీ, వివ రాలు మాత్రం ఇలా ఉన్నాయి. ముస్తఫా అన్సారీ అనే యువకుడు ఇసుకలో రక్తమోడుతూ దొర్లుతుంటాడు. కొద్ది సెకన్లలోనే సునీల్ కుమార్ యాదవ్ అనే హోమ్ గార్డు అతడిపైకి ఎగిరి కాళ్ళతో విపరీతంగా తంతూ, దూషిస్తూ కని పిస్తాడు. కొద్దిసేపటి తర్వాత ముస్తఫా చనిపోవటం కనిపిస్తుంది. ఆ వెంటనే బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక పోలీసు అధికారి సజా మిల్‌గయీ (అతడికి తగిన శిక్ష పడింది) అని అంటాడు. బీహార్‌లో ఏం జరుగుతుందో తెలియజేయటా నికి ఈ ఉదాహరణ చాలు. చనిపోయిన ముస్తఫా తల్లి ఆ విడియో రికార్డింగ్ ఉన్న సెల్‌ఫోన్‌ను ఎప్పుడూ తన వద్దే ఉంచుకుంటుంది. ఎవరు అడిగినా దాన్ని చూపిస్తూ భోరున విలపిస్తుంది. ఈ మొత్తం కుటుంబంలోకీ ముస్తఫా ఒక్కడే కాస్త చదువుకున్నవాడు. ఘటన జరిగి నాలుగేళ్ళయినా తండ్రి మహ్మ ద్ ఫల్కాన్ అన్సారీ తేరుకోలేదు. ఫార్బిస్‌గంజ్ వీధుల్లో మట్టి కుండలు అమ్ము కుంటూ కుటుంబం పొట్ట నింపుకునేందుకు కష్టపడుతున్న ఆ వృద్ధుడు శూన్యంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడుతూ కనిపిస్తాడు. కశ్మీర్‌లో కూలీగా పని చేసే ముస్తఫా సోదరుడు అన్వర్ పిచ్చివాడయ్యాడు. ఇక వృద్ధులైన తల్లి దండ్రులు ఇద్దరూ రాత్రివేళ నిద్ర పట్టేందుకు, ఆందోళన తగ్గేందుకు అల్‌ప్రో జొలామ్ మందు బిళ్ళలను మింగాల్సిన పరిస్థితి. తన కుమారుడి చివరి క్షణాలను గురించి వివరిస్తూ వాడు కల్మా చదవటం ప్రారంభించాడు అని చెప్పాడు ఫల్కన్ అన్సారీ. కల్మా అంటే చిన్న పిల్లలకు నమాజ్ నేర్పించటానికి ముందు నేర్పించేదన్న మాట.

చిన్న ఘటన అన్న సర్కార్…
ఇంత జరిగినా, స్థానిక యువ పాత్రికేయుడు అమరీందర్ కుమార్ ఈ ఘట నను విడియో తీసి నెట్‌లో ఉంచినా, తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తినా సర్కార్ మాత్రం సుప్రీంకోర్టుకు ఇది చాలా చిన్న ఘటన అని తెలిపింది. అలా జరగటానికి గ్రామస్థులే కారణమంటూ వారిపైనే తోసేసింది. ఘటన జరిగిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ గ్రామాన్ని సందర్శించి సహాయం చేస్తామని, పరిహారం ఇస్తామని ప్రకటించారు. సర్కార్ దుర్మార్గా నికి వ్యతిరేకంగా వేలాది మంది సంఘటితమై ఆ అడ్డుగోడను కూల్చేస్తే ఫ్యా క్టరీ యజమాని హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ అనుమతి తెచ్చుకుని గోడ నిర్మిం చాడు. దానికి వంద మీటర్ల దూరంలో ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు వేశారిప్పుడు.

ఇప్పటికీ కేసులు..
దుర్మార్గమైన ఈ ఘటన జరిగి నాలుగేళ్ళు అయినా ఇప్పటికీ నిరసనకారు లపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ముస్తఫాపై దారుణంగా దాడి చేసిన హోంగార్డును ప్రశాంతత ఏర్పడేదాకా జైలులో ఉంచి విడుదల చేసి మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. నిరసన వెల్లువెత్తిన కొన్ని రోజులకు పారిశ్రా మికవేత్త కట్టిన అడ్డుగోడను కూల్చివేశారు. ఇప్పుడు అతడు మళ్ళీ రోడ్డును అడ్డుకుంటూ గోడ కట్టాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే… ఫార్బిస్ గంజ్ టౌన్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న భజన్‌పురిలోని కొన్ని ఎక రాల భూమిని రూ.3,000-రూ.6,000ల అతి తక్కువ ధరకు సేకరించి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. 2010లో ఈ భూమిని ఆరో సుందరం ఫ్యాక్టరీ యజమానికి అప్పగించారు. అతడికి బిజెపి నాయకత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2011 జూన్ 2న అంటే కాల్పులు జరగటానికి ముందురోజు అధికారులు ఒక ప్రకటన జారీ చేస్తూ గ్రామ మార్కెట్‌ను, కర్బాలాను, సమీపంలోని టౌన్‌ను కలిపేందుకు వీలుగా ఉన్న రోడ్డుపైకి ఎవరూ రాకూడదని తెలిపారు. ఆ మర్నాడే ముస్లిం లు ఉదయం ప్రార్థనలు ముగించుకున్న కొద్దిసేపటికే ఆ రోడ్డును మూసివేశారు.

దానికి నిరసనగా నిరసన వెల్లువెత్తి గ్రామస్థులు ఆ అడ్డుగోడలో కొంత భాగాన్ని కూల్చి వేశారు. ఇంకేముంది?… ఆ ఫ్యాక్టరీ యజమాని పోలీ సులకు చెప్పటం వారు గ్రామంలోకి ప్రవేశించి వెనువెంటనే కాల్పులు ప్రారం భించటం జరిగిపోయింది. కాల్పుల్లో ముస్తఫా (18), ముఖ్తార్ అన్సారీ (22), నౌషద్ అన్సారీ (పది నెలలు), గర్భిణి షజ్మినా ఖాతూన్ (35) చనిపో యారు. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే కాల్పుల్లో కనీస నిబంధనలు కూడా పాటించలేదు. శరీర పైభాగాల వైపు గురి పెట్టకూడదని నిబంధనలు ఉన్నా ఖాతరు చేయకుండా కాల్పులు జరిపారు. గుమికూడిన వారిపైనే కాదు గ్రామంలో మరి కొందరిపై కూడా కాల్పులు జరిపారు. రయీస్ అన్సారీ అనే యువకుడి ముఖం ఈ కాల్పుల్లో ఛిద్రమైంది. ప్రభు త్వం ఇచ్చిన పరిహారం యావత్తూ అతడు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటా నికే సరిపోయింది. ఇక షజ్మినా తలపై సూటిగా కాల్చిచంపేశారు. ఎనిమిది సంవత్సరాల మంజూర్ అన్సారీ మెడపై కాల్పులు జరిపారు. ఇక చిన్నారి నౌషద్ తల్లి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది.

ఎవరిని కదిపినా అదే విషాదం
చనిపోయిన నలుగురి కుటుంబాలే కాదు… గ్రామంలో ఎవరిని కదిపినా ఇలాంటి విషాద స్పందనలే లభిస్తున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరుకున్నాయం టే గ్రామంలో సగం జనాభా ఇప్పుడు ఆ ఘటనను గురించి మాట్లాడటం లేదు…అందుకు విరుద్ధంగా వారి పెదాలపై విషాదపూరితమైన, నిర్వేదంతో కూడుకున్న నవ్వులు కనిపిస్తున్నాయి. ఎవరొచ్చి ఏం చేస్తారన్న భావన వారిని అలుముకుంది. పోలీసు కాల్పులలో రహీనా ఖాతూన్ కుడి మోచేయిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇప్పుడు ఆ చేయి సరిగా పని చేయటం లేదు. ఆమె కుమారుడు పది మాసాల నౌషద్‌ను ఖననం చేసి తిరిగివచ్చిన తర్వాత తన కుమారుడు అన్నం కూడా తినటం లేదంటున్నదామె. బబువా (నౌషద్ ముద్దుపేరు) చలాగయా అని వాడి తాతయ్య రఫీక్ అన్సారీ కన్నీరు పెడుతుం టాడు. ఇలా ఎవరిని కదిపినా ఇదే ఘోష…

ఈ ఎన్నికల వేళ…
ఇప్పుడు సర్కార్‌కు మళ్ళీ ఈ గ్రామం గుర్తుకు వచ్చింది. అధికారగణం అక్క డికి వెళ్ళి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటిస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని, ఇళ్ళు కట్టిస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనీ ఊదర కొడు తోంది. అందరూ అన్నీ వింటున్నారు. వారిలో గూడు కట్టుకున్న విషాదం, అది పెల్లుబుకజేస్తున్న ఆగ్రహాగ్ని ఎలా ఉన్నా ఎన్నికల్లో వారికి మరో మార్గం లేదు. చూస్తూ బిజెపిని గెలిపించలేరు. మరో మార్గం లేని స్థితిలో నితీశ్‌కు కాకపోయినా ఆయన కూటమికే ఓటేస్తామంటున్నారు.