Home దునియా వింత భవంతి

వింత భవంతి

Building

 

కట్టడాలన్నింటినీ ఒకే తీరులో చతురస్రాకారంలోనో, దీర్ఘచతురస్రాకారంలోనో నిర్మించుకుంటే అందులో వింత ఏముంటుంది? అనుకున్నట్టున్నారు. ఆ ఆలోచనకు రూపమే నత్త ఆకారంలో నిర్మించిన భవనం. ఇదెక్కడనుకుంటున్నారా..? బల్గేరియా రాజధాని సోఫియాలో పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత కట్టడం ఇది. నత్త ఆకారంలో నిర్మించిన ఈ ఐదంతుస్తుల భవంతి నిర్మాణంలో ఇటుకలను ఉపయోగించకపోవడం విశేషం. పూర్తిగా పర్యావరణ అనుకూలమైన సామగ్రితోనే దీనిని నిర్మించారు. చూడటానికి ఇదేదో పిల్లల మ్యూజియంలా కనిపిస్తుంది కానీ, నిజానికి ఇది నివాస భవనం.

 

Strange Building Constructed in Bulgaria