Home అంతర్జాతీయ వార్తలు చైనాలో వింత చేప …… ఆన్‌లైన్‌లో హల్‌చల్

చైనాలో వింత చేప …… ఆన్‌లైన్‌లో హల్‌చల్

fishబీజింగ్: సముద్రలలో చేపలు వేటకు వెళ్లినప్పుడు వింత చేపలు పడుతుంటాయి. ఆ చేపలను సముద్ర ఒడ్డున మనం చూస్తుంటాము. చైనాలో ఓ టీచర్ గత 20 సంవత్సరాల నుంచి చేపల వేటకు వెళ్తుండేవాడు. వారం రోజుల క్రితం చేపలు వేటకు వెళ్లినప్పుడు, చేప తల భాగం మనిషి ఆకారంలో ఉన్న చేపను పట్టుకున్నాడు . ఈ చేప పొడువు 30 సెంటీ మీటర్ల పొడవు, 800గ్రాముల బరువు ఉంది. చేప కళ్లు నోరు, ముక్కు భాగం మనిషిలాగానే ఉన్నాయి. వుగంగ్ సిటిలో నివసిస్తున్న క్వియు అనే స్కూల్ టీచర్ ఈ అరుదైన చేపను గత ఏప్రిల్ 30న నదిలో పట్టుకున్నాడు. మొదటి సారిగా ఇలాంటి అరుదైన చేప దొరికిందన్నారు. ఈ చేపను ఆన్‌లైన్‌లో పెట్టాడు.  ఆన్‌లైన్లో ఈ చేప హల్‌చల్ చేస్తోంది. ఈ చేపను ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఇలాంటి చేప దొరకడం అరుదని చైనా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. 2010లో ఇలాంటి చేప ఉన్నట్లు ఇంగ్లాండ్ మీడియా తెలిపింది. ఈ వింత చేపను కొనుగోలు చేసేందుకు యజమానికి 40 వేల ఫౌండ్లు ఆఫర్ చేశారని మీడియా పేర్కొంది.