Home జాతీయ వార్తలు ఢిల్లీలో కలకలం: పెళ్లికూతురిపై కాల్పులు..

ఢిల్లీలో కలకలం: పెళ్లికూతురిపై కాల్పులు..

 

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లికూతురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పరారైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన పూజ(19) అనే యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. గురువారం(నిన్న) పెళ్లి వేడుక కోసం అందరూ మండపానికి చేరుకుని సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా వరుడితో కలిసి పెళ్లికూతురు ఫోటోలు దిగితున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు.

దీంతో పూజ పెళ్లి వేదిక మీదే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వధువు కాలికి, భుజానికి బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పెళ్లి మండపంలో రికార్డైన వీడియో ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పూజను ప్రేమించిన ఓ వ్యక్తి, తనను మోసం చేసి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంటుందనే కోపంతో ఆమెపై కాల్పులు జరిపినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు.

Strange person attack on bride in wedding hall at Delhi