Home అంతర్జాతీయ వార్తలు అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్‌ తొలి టేకాఫ్…

అతిపెద్ద విమానం స్ట్రాటోలాంచ్‌ తొలి టేకాఫ్…

Stratolaunch Flies

కాలిఫోర్నియా: ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేరుగాంచిన స్ట్రాటోలాంచ్‌ శనివారం తొలిసారి ఎగిరింది. 2,26,800 కేజీల బరువున్న ఈ విమానం రెక్కల పొడవు  117మీటర్లు. కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ఉండే మోజావే విమానాశ్రయం నుంచి తొలి టేకాఫ్ తీసుకుంది. ఈ విమానం విజయవంతంగా టేకాఫ్ కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన విమానం టేకాఫ్ అయిన రికార్డును సొంతం చేసుకుంది. గంటకు 304కి.మీ వేగంతో 17వేల అడుగుల ఎత్తులో ప్రయాణించింది.6 ఇంజిన్లు, 2 విమాన బాడీలు కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. అయితే ఈ విమానం ఎగరడానికి చాలా పెద్ద రన్‌వే కావాల్సి ఉంటుంది. స్ట్రాటోలాంచ్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు దివంగత పాల్ అలెన్ 2011లో ఈ కంపెనీని స్థాపించారు.

Stratolaunch Flies World Largest Plane for the First Time