Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

జనసేన పార్టీని బలోపేతం చేస్తాం…

strengthen Janasena party under Secunderabad Parliament

ముషీరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ బిట్ల రమేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ మీ సేవా కేంద్రం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువతకు పార్టీ సభ్యత్వాన్ని నమోదు అందచేసారు. అనంతరం రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి యువతీ, యువకుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గత రెండు రోజుల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1500 వందల మంది సభ్యత్వం తీసుకున్నామన్నారు. యువతే కాకుండా ఆటో డ్రైవర్లు, రోజు వారి కూలీలు, చిరు వ్యాపారస్తులు సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌తో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అరవింద్‌కుమార్, రాజు, తిలక్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments