Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పోలీసులపై ప్రజల నమ్మకాన్ని పెంచాలి

police

మనతెలంగాణ/సిరిసిల్ల: పోలీసులు ప్రజల అంచనాలకు త గినట్లుగా పనిచేస్తూ పోలీసులపై ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్‌పి రాహుల్ హెగ్డే అన్నారు.గురువారం డిపివోలో నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజలతో మర్యాదగా,స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకేవిధమైన సేవలను అందించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారిలో పేద,ధనిక పలుకుబడి తదితర వివక్షల ను చూపరాదని అందరికి సమాన న్యాయం అందేలా చూ డాలన్నారు.మహిళలు, వృద్ధుల పట్ల గౌరవ భావం ప్రదర్శించాలన్నారు. శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి కేసుల నమోదులో తాత్సారం చేయకూడదన్నారు. దర్యాప్తు లో ఆధునిక,సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు.

            సిసి కెమెరాల ఉపయోగాన్ని అర్థం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి వారిని భాగస్వాములు చేయాలన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి పోలీస్ సాంస్కృతిక బృందాలతో ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. రిసెప్షన్‌ కౌంటర్లతోజాగ్రత్తగా,ఓపికగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేవారి పట్ల కఠిన వైఖరి తో వ్యహరిస్తూనే వారికి కౌన్సిలింగ్‌లు నిర్వహించాలన్నారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, అక్రమ ఇసుక రవాణా, అక్ర మ చిట్టీల దందాలు,అక్రమ వడ్డీ వ్యాపారాలపై కఠిన చర్య లు తీసుకోవాలన్నారు.తరచుగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి శాంతి భద్రతలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అ డిషనల్ ఎస్‌పి రవీందర్‌రావు, డిఎస్‌పిలు నరహరి, వెంకటరమణ,చంద్రశేఖర్‌తోపాటు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Comments

comments