Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఒత్తిడి ప్రభావం బేబీపై పడుతుంది..

pregnant

సందేహాలు  సమాధానాలు

గర్భిణులకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. చిన్న చిన్న సమస్యలకు డాక్టరు దగ్గరకి వెళ్లి అడగడానికి చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. అలాంటివారి కోసం గైనకాలజిస్ట్ సునీత మన తెలంగాణ పాఠకుల కోసం తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు.
* గర్భిణులు ఒక్కొక్కసారి ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి మూలంగా వారికి వచ్చే సమస్యలు ఏమిటి?
భావోద్వేగపరంగా, శారీరక పరంగా ఒత్తిడి ఉంటే ఆ ప్రభావం బేబీపై ఎక్కువ ఉంటుంది. డెలివరి అయిన నెలకే జాబ్ కి వెళ్లినా బేబీకి బాండింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి పాలు తక్కువ వస్తాయి. గర్భిణి తప్పనిసరిగా 6 లేక 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడికి గురయ్యే తల్లికి పాలు ఎక్కువగా రావు. పిల్లలు కూడా నీరసపడతారు. పాలు ఉన్నప్పుడు బేబీకి ఇస్తూ ఉంటేనే అవి మళ్లీ తయారవుతూ ఉంటాయి.
* మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ఏమేమి వ్యాయామాలు చేయాలి?
గర్భం వచ్చినప్పుటి నుండి మహిళలకు దానికి సంబంధించిన ఫిజియోథెరపీ వ్యాయామాలు ఉంటాయి. ఫిజియోథెరపీ కేంద్రానికి వెళితే వారు దానికి సంబంధించినవే ఎక్కువగా చేయిస్తారు. అతిగా చేయకూడదు. నార్మల్ డెలివరీ అవటానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అక్కడి వారు నడుముకు సంబంధించినవే చేయిస్తారు. నడుం మీద ఎక్కువ ప్రభావం వుంటుంది కాబట్టి దానికి సంబంధించిన వ్యాయామాలు చేయిస్తారు. డెలివరీ అయ్యాక ఆరు వారాల తర్వాత చేసే ఎక్సర్‌సైజులు కొన్ని ఉన్నాయి. నడుం బలపడటానికి, బలంగా ఉండటానికి ఎక్సర్‌సైజులు కొన్ని ఉన్నాయి. హాస్పిటల్స్‌లో వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా చెపుతూ ఉంటారు. మా హాస్పిటల్‌లో కూడా ఉన్నాయి. దానికి స్పెసిఫిక్‌గా ఉంటాయి. వీటిమూలంగా చాలా లాభాలు ఉంటాయి. మన ఇండియాలో ఇలాంటి విషయాలను నిర్లక్షం చేస్తారు. ఎక్కువ వీటికి ప్రాముఖ్యత ఇవ్వరు . వీటితో చాలా ఉపయోగం ఉంటుంది.

Comments

comments