Home తాజా వార్తలు మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు…

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు…

Sexual Abuse

 

లైంగిక హింస,ఆడపిల్లలు అమ్మకం, అక్రమ రవాణా నివారణకై జిల్లాలో ’సఖి’ కేంద్రం ప్రారంభం
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి

నిర్మల్ : సమాజంలో మహిళలు, బాలికల పై జరుగుతున్న వేధింపులు, ఆరాచకాలు అరికట్టుటకై సత్వర పరిష్కారం కోసం జిల్లాలో సఖి కేంద్రం ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి అన్నారు. శనివారం పట్టణంలోని సరస్వతి నగర్‌లో మహిళా,శిశు అభివృద్ది, సంక్షేమ శాఖ సెడ్స్ స్వచ్చంద సంస్థ మహిళలనుద్దేశించి ఏర్పాటు చేసిన సఖి కేంద్రంను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసు తర్వాత దేశవ్యాప్తంగా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. మహిళల పై వేధింపుల నివారణకై 2013 లో గృహ హింస చట్టం అమలులోకి వచ్చిందనారు. మహిళల పై జరుగుతన్న ఆరాచకాలు అరికట్టుట, గృహహింస, వరకట్నం, వేధింపులు,లైంగిక,కౌన్సిలింగ్, సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా గ్రామాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులు పని చేసే చోట వేధింపులు, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణ నివారణ కోసం 181 నెంబర్‌కు కాల్ చేసి తక్షణ రక్షణ, కౌన్సిలింగ్, సలహాలు పొందవచ్చన్నారు.

అలాగే బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణ వాటి పరిష్కారానికి గ్రామాలలో మహిళలకు అవగాహణలు కల్పించాలన్నారు. సఖి కేంద్రానికి వచ్చే వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం సఖి కేంద్రం పోస్టర్లను ఆవిష్కరించారు.

మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మీ డిఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రణిత, జిల్లా వైద్యాశాఖ అధికారి జలపతినాయక్,సెడ్స్ స్వచ్చంద సంస్థ నిర్వాహాకులు సురేందర్, జిల్లా మహిళ సంఘం అధ్యక్షురాలు నిర్మల, సెక్వేరల్ అధికారి కరుణ, జెజెబి మెంబర్ మంజుల, సిడిపిఓలు, వినూత్న, శ్రీలత, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు,సిబ్బంది, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, రిసోర్స్, పర్సన్‌లు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Strict Actions are Committed to Sexual Abuse