Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కఠినమైన చర్యలు తప్పు

Strict actions are wrong

ప్రభుత్వాసుపత్రులో సరైన వైద్యం అందలేదని ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తప్పు

మన తెలంగాణ/మెదక్: వైద్యాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలని జిల్లా కలెక్టర్ ధర్మారడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సదుపాయం కల్పించడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసుపత్రికి వచ్చే రోగులతో అధికారులు మర్యాధగా ప్రవర్తించాలని, త్వరితగతిన వైద్య సదుపాయాలను అందజేయాలన్నారు. ఈ సందర్భంగా మెదక్, నర్సాపూర్, తూప్రాన్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై ఆరాతీశారు ఆయా ఆసుపత్రుల్లో ఉండాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది యొక్క వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్ల వైద్యాధికారి వెంకటేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు.

Comments

comments