Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం

  • బాబా నర్సింగ్ హోంపై కేసు నమోదు
  • మరిన్ని ఆసుపత్రులపై ప్రత్యేక నిఘా…

Private-Nursing-Homeపెబ్బేరు : ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిషేదించినప్పటికీ పట్టించుకోకుండా పాపాన్ని మూటగట్టుతున్నాయి.గత నాలుగురోజుల కిందట పెబ్బేరు మండల కేంద్రంలో బాబా నర్సింగ్ హోంలో జిల్లా వైద్యాదికారి మల్లికార్జునప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీనితో ఆసుపత్రి యాజమాన్యం చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నట్లు వారు నిర్ధ్దారించారు. ఆల్ట్రా సౌండ్ స్కానర్‌తో పాటు, మరిన్ని పరీక్షలు అర్హతలు లేని వారితో చేయిస్తున్నారని పోలీసుల విచారణలో రుజువు కావడంతో జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆసుపత్రిపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అలాంటి
ఆసుపత్రులను సీజ్ చేయాలని ఆదేశించారు. పెబ్బేరు మండల కేంద్రంలో పుట్టగొడుల్లా రోజుకో ఆసుపత్రి, నర్సింగ్‌హోంలు ఏర్పాటు చేస్తూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవ అనంతరం రక్తం రక్త స్రావమై దళిత మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఇటీవల మరో ఆసుపత్రిలోప్రసవ అనంతరం తల్లితో పాటు పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన మహిళ కూడా దళిత వర్గానికే చెందినది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మధ్య వర్తుల ప్రమేయం తో చనిపోయిన ప్రాణం తిరిగివస్తుందా.అంటూ బేరసారాలు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు పెంచి పోషిస్తున్నారు. ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పోయేది ఏముందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటువంటి ఇబ్బందులు మనదాకా వస్తే ఆ పరిస్థితి తెలియదన్నట్లుగా మద్య దళారులు వ్యవహరిస్తున్నారు.
ప్రజలకు చికిత్స అవసరమే కాని … పైవేట్ ఆసుపత్రులు నర్సింగ్‌హోంలతో ప్రజలకు చికిత్స అవసరమే కాని అర్హతలు లేనివారితో ఆసుపత్రులు కొనసాగించడం దౌర్బాగ్యం . మండల కేంద్రంలో సుమారు 8 నర్సింగ్ హోంలు ఉండగా అందులో ఏ ఒక్క డాక్టర్ కూడా అర్హత లేకపోవడం కేవలం బోర్డులల్లో మాత్రం డిజిఓలు , ఎంఎస్‌లు , సూచిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఈ ఆసుపత్రులపై సీరియస్‌గా ప్రత్యేక నిఘా ఉంచడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఆసుపత్రులు మూత పడడం ఖాయం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువు… ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు 44వ జాతీయ రహదారిపై గల పెబ్బేరు ఆరోగ్య కేంద్రంలో అంతంత మాత్రంగానే వైద్యం నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం చిన్నారుల కోసం వేసే టీకా కోసం ఆసుపత్రి బయట పడిగాపులు కాస్తున్నారు. ఈ టీకా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లభ్యం కాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల కు వెళ్లక తప్పడం లేదు. గతంలో ట్యూబెక్టమీ, ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నప్పటికి అవి కొనసాగడం లేదు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు వచ్చినప్పటికి వారికి సరైన మందులు లేక వనపర్తి లేక కర్నూల్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు .24 గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్స్ కేవలం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 వరకు విధులు ముగించుకుని వెళ్లుచున్నారు. ఇప్పటికైనా 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments