Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బలవంతపు బంద్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

Strict actions to be forced into compulsive bandhs

పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్
మనతెలంగాణ/వరంగల్ క్రైం : స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట బలవంతపు బంద్‌లకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తప్పవని, ఎవరైన బలవంత పెడితే తమ దృష్టికి తెలుకురావాలని, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ కళాశాల, పాఠశాల ప్రిన్సిపల్‌లతో శనివారం కమిషనరేట్‌లో నిర్వహించారు. సమావేశంలో వారిని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కొంతమంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట బలవతంగా కళాశాల, పాఠశాలల బంధుచేయాలని బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఈలాంటి సందర్భంలో యాజమాన్యం మా దృష్టికి తీసుకురావాలని, పైనా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా సంస్థలు బంద్ పడుట వలన విద్యార్థిని విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఇకపై రాబోవు రోజుల్లో ఏ సంస్థనైన బంద్‌కు పిలుపునిస్తే ఇందుకు విద్య సంస్థలు స్పందించి విద్య సంస్థలను బంద్ పాటించాల్సిన అవసరం లేదని, ఇందుకోసం పోలీసులు పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భద్రత కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ కమిషనర్ ప్రిన్సిపల్స్‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాజోవు నూతన విద్య సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకోని కాలేజీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు ప్పాడకుండా ముందస్తుగా చర్యలను చేపట్టాలని ఇందులో భాగంగా ర్యాగింగ్‌కు పాల్పడితే జరిగే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా కళాశాల అవరణలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అదే విధంగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లుగా సమాచారం వస్తే విద్యార్ధ్థులపై కళాశాల యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం ద్వారా కలిగే నష్టాలను విద్యార్థులకు అవగాహనకల్పించే విధంగా అధ్యాపకులు విద్యార్థుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, మత్తు పదార్థాలు విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే విద్యార్థులపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే విధంగా రోడ్లు ప్రమాదాలు దృష్ట విద్యార్థులకు హెల్మెట్ దరించే విధంగా కళాశాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఎవరైన వెందింపులకు పాల్పడితే 9491089257కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్, ఈస్ట్ జోన్ల డిసిపిలు వెంకట రెడ్డి, వెంకటేశ్వర్లు, అదనపు డిసిపి మురళీదర్, ఎసిపిలు ప్రభాకర్ రావు, విద్యాసాగర్, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, జనార్ధన్, సధానందంలతో పాటు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments