Home తాజా వార్తలు నకిలి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు…

నకిలి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు…

Seeds

 

తానూర్‌: విత్తనాలు, కాలం చెల్లిన పెస్టిసైడ్స్ మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని ఉమి(కె) గ్రామంలో పెస్టిసైడ్స్ షాపుల పై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు, జాయింట్ ఆపరేషన్ జరిపి సీడ్స్, పెస్టిసైడ్స్ షాపుల పై దాడులు చేశారు. భారీ మెత్తంలో కాలం చెల్లిన పెస్టిసైడ్స్ మందులు నిల్వలను స్వాధినం చేసుకున్నారు.

ఈ సందర్బంగా తానూర్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఓం సాయి ఆగ్రో ఏజెన్సీ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, దుకాణం పై శుక్రవారం మధ్యాహ్నాం 12 గంటలకు వ్యవసాయ ఎడిఎ అంజిప్రసాద్ సమక్షంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేసి అనాధికారిక గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుల మందులను, విత్తనాల గోదాంలపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడి చేసి భారీ మొత్తంలో స్వాధినం చేసుకున్నట్లు తెలిపారు. అందులో కాలం చెల్లిన మొక్కజొన్న 4 ఫ్యాకెట్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించి చూడగా లిల్వ మందులు 137.25 లీటర్స్ దాని విలువ రూ. 331949 ఉంటుందన్నారు. అలాగే కీటకనాశక మందులు 398 లీటర్స్ వాటి విలువ 495650 రూపాయిలు ఉంటుందన్నారు.

కీటకనాశక మందులు, మొక్కజొన్న ఫ్యాకెట్లు స్వాధినం చేసుకొని, గోదాంను సీజ్ చేసి సదరు వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ ఎడిఎ అంజిప్రసాద్ మాట్లాడుతూ రైతులు వ్యాపారుల చేతుల్లో మోసపోవద్దని, ఖరీఫ్ పంట విత్తనం కొనుగోలు చేసి వెంటనే బిల్లులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా డిఎస్పీ రాజేష్‌భల్లా, ముథోల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, వ్యవసాయ ఎఓ గణేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Strict Actions to Sell Counterfeit Seeds