Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు

sit2

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : చట్టాలను ఎవరు చేతిలోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్‌పి విష్ణు వారియర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకేంద్రంతో శాంతి భద్రతల ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్, సోషల్ మీడియా కారణంగా పుకార్లు, వదంతులు చాలా వస్తున్నాయన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా, ప్రతికల వారు మీడియా విలువలు పాటించాలన్నారు. ప్రజలు కూడా రూమర్స్‌ను నమ్మవద్దన్నారు. రూమర్స్ వస్తే వెంటనే రెవెన్యూ లేదా పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. రెవెన్యూ పోలీస్ డిపాట్‌మెంట్ ప్రజలవైపే ఉంటుందన్నారు. ప్రజల బద్రత విషయంలో రాజీపడబోమన్నారు. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో ఆరు కేసులు నమోదు చేశామన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో ట్రైనీ కలెక్టర్ క్రాంతిరెడ్డి, డిఎస్‌పి మనోహార్‌రెడ్డి, సిఐ జాన్‌దివాకర్ ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments