Home తాజా వార్తలు ఎంసెట్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం: శ్రీహరి

ఎంసెట్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తాం: శ్రీహరి

eamcet-2హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట ఎంసెట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎంసెట్-2 రద్దు చేయవద్దంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మెరిట్ విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. ఎంసెట్ లీకేజీపై సిఐడి అధికారులతో డిజిపి అనురాగ్ శర్మ సమీక్ష నిర్వహించారు. కాసేపట్లో  డిజిపి అనురాగ్ శర్మ  ఎంసెట్ లీకేజీ నివేదిక సిఎం కెసిఆర్‌కు అందజేయనున్నారు.
ఎంసెట్ స్కాంలో రెసోనెన్స్‌వి కోచింగ్ సెంటర్‌కు సంబంధం లేదని ఈ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు. నేను పరారీలో లేను, విచారణకు పిలిస్తే వస్తానని ఆయన తెలిపారు. 23వ ర్యాంకర్ ఖమ్మంకు చెందిన విద్యార్థిని మావద్ద లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోలేదన్నారు. ఆమె ఇంటర్ ఖమ్మంలోనే చదివిందని ఆయన పేర్కొన్నారు. మా కోచింగ్ సెంటర్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు.