Home తాజా వార్తలు తెలంగాణలో నిలిచిపోయిన వాహనాలు

తెలంగాణలో నిలిచిపోయిన వాహనాలు

Lorry Owners Strike for Increasing of Diesel Rates

 

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు రవాణా రంగ అనుబంధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణంగా ఆర్‌టిసి బంద్ పాటిస్తోంది, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. లారీ, ఆటో, క్యాబ్, రైల్వే కార్మిక సంఘాల మద్దతు తెలిపాయి. ఎంజిబిఎస్, జెబిఎస్, సికింద్రాబాద్ బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.  జిఎస్‌టి విధానం, రోజు వారీ డీజిల్ ధరల మార్పిడి, రహదారులపై వసూలు చేసే రోడ్డు టోల్ టాక్స్ విధానాన్ని నిరసిస్తూ సమ్మెకు కార్మికులు దిగారు. ఈ సమ్మెలో ప్రజా రవాణాలో కీలకంగా ఉంటున్న ఆర్‌టిసితో పాటు రవాణా శాఖ, ప్రభుత్వ, ప్రైవేటు రంగ వాహనాలు ఒక రోజు సమ్మెలో పాల్గొని రవాణాను స్తంభింపజేస్తున్నాయి.