Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సంగారెడ్డి బస్‌డిపో ఎదుట ధర్నా

Breaking-Newsమెదక్: జిల్లాలోని సంగారెడ్డి బస్‌డిపో ఎదుట నిరసనకారులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా సంగారెడ్డి బస్‌డిపో ఎదుట మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు జగ్గారెడ్డితోపాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments