Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం విరమించాలి

Strike

మహబూబాబాద్ టౌన్: ప్రాజెక్ట్‌ల పేరుతో ప్రభుత్వం చేపట్టిన 2016 భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని సిపిఐ మానుకోట జిల్లా కార్యదర్శి బి విజయ్ సారధి అన్నారు. గురువారం సిపిఐ  ఆధ్వర్యంలో స్థానిక ముడు కొట్ల సెంటర్ తొర్రూర్ రోడులో భారి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని తీసుకురావడం వల్ల వివిద ప్రాజెక్ట్‌లు, నిర్మాణాలు చేపట్టిన ప్పటికి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించి 2016 భూ సేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాన్ని సవరణ చేసే ఆధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఈచట్టం వలన అనేక మంది రైతులు      భూ నిర్వాసితులు కావల్సి వస్తుందని అన్నారు. నిరాకరించిన రైతులపై దౌర్జన్యాలు చేస్తు అక్రమంగా భూములు లాక్కోవడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అక్రమ కేసులు బనాయిస్తే బయపడేది లేదన్నారు.  మున్సిపల్ ప్లోర్ లీడర్ బి అజయ్ సారధి, పాండురంగా చారి, పెరుగు కుమార్, తండా సందీప్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, నవీన్, తోట విజయ్, రవి, లింగ్యా నాయక్, బోళ్ల కృష్ణయ్య, మామిండ్ల సాంబలక్ష్మి, ఎండి ఫాతిమా, దాస్యం రామూర్తి, చింతకుంట్ల యాకాంబ్రం తదితరులు ఉన్నారు.

Comments

comments