Home బిజినెస్ పెట్రోల్ బంక్ యజమానుల సమ్మె విరమణ

పెట్రోల్ బంక్ యజమానుల సమ్మె విరమణ

 16 నుంచి రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలు
 అర్ధరాత్రికి బదులు ఉదయం 6 నుంచి సవరణల డిమాండ్‌కు ప్రభుత్వ అంగీకారం

bunkన్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్ల రోజువారీ సవరణ లను వ్యతిరేకిస్తూ  తలపెట్టాలనుకున్న  సమ్మెను పెట్రోల్ పంప్ యజమానులు బుధవారం ఉపసంహ రించుకున్నారు. అర్ధ రాత్రికి బదులుగా ఉదయం 6 గంటలకు  సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించి నందున వారు ప్రతిపాదిత సమ్మెను విరమించుకు న్నారు.  పెట్రోల్, డీజిల్ రోజువారీ రేట్ల సవరణ ఈ శుక్రవారం నుంచి అమలులోకి రానున్నది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు అర్ధరాత్రి నుంచే అమలు అయ్యేవి. కానీ రోజువారీ రేట్ల సవరణను అర్ధరాత్రి నుంచి మార్చడానికి డీలర్లకు అదనపు పనివాళ్లను పెట్టుకోవడం కష్టం కనుకే వారు వ్యతిరేకించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉదయం 6 నుంచి సవరణలు చేసేందుకు అంగీకరించింది. పెట్రోల్, డీజిల్ రోజువారీ ధరల మార్పు జూన్ 16 నుంచి అమలులోకి రానున్నట్లు చమురు శాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రభుత్వ చమురు సంస్థల రిటైల్ ఔట్‌లెట్లు దేశ వ్యాప్తంగా 54,000 ఉన్నాయి. వాటిలో నాలుగింట మూడోవంతు ప్రైవే ట్ పంప్ యజమానులవే. ప్రజాప్రయోజనాల దృ ష్టానే రోజువారీ రేట్ల సవరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని అఖిల భారత పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య  అధ్యక్షడు అశోక్ బధ్వార్ చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్టానే తాము కూడా జూన్ 16 నుంచి తలపెట్టాలనుకున్న ‘అమ్మకం ఉండదు-కొనుగోలూ ఉండదు’ అన్న సమ్మెను విరమించుకు న్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ చమురు ధరలు, విదేశీ మారక రేట్ల ఆధారంగా ప్రతినెల 1వ తేదీ, 16వ తేదీ మారుతుండేవి. ఇన్నాళ్లు 15 రోజులకోసారి పంప్ ఆపరేటర్లు చేసే ఈ ధరల మార్పు పనిని ఇకపై వారు ప్రతిరోజు చేయాల్సి ఉంటుందని ఐఒసి చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. ఇప్పటివరకు 20 శాతం పెట్రోల్ పంప్‌లే ఆటోమేటేడ్‌గా మారాయి. పెట్రోల్ పంప్‌ల వద్ద  ఎల్‌ఇడి స్క్రీన్‌లు, టోల్‌ఫ్రీ నెంబర్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్‌లు మొబైల్ యాప్, ఎస్‌ఎంఎస్  సహా వివిధ సాధనాల ద్వారా రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని తెలుపుతామని దేశంలో అతి పెద్ద ఇంధన రిటైలర్ ఐఒసి తెలిపింది.