Home ఖమ్మం ప్రియురాలి దీక్ష విరమణ

ప్రియురాలి దీక్ష విరమణ

darna-image

మన తెలంగాణ/ఆళ్ళపల్లి: పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు బుధవారం ధీక్షకు దిగిన గొగ్గెల సమ్మక్క గురువారం కూడా ధీక్షను కొనసాగించింది. ఈ ధీక్షకు న్యూడెమోక్రసీ మహిళా సంఘం కూడా గురవారం మద్దతు తెలిపారు. అనంతరం న్యూడెమోక్రసీ పీడబ్లూ వో జిల్లా సభ్యులు జానికిమాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాల నుండి ప్రేమించి, చివరకి పెండ్లి చేసుకోనని ప్రియుడు రాజబాబు మొరాయించడంపై ఆమెఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రియుడి పెండ్లి చేసుకునేంతవరకు అమ్మాయికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీడబ్లూవో డివిజన్ కార్యదర్శి సావిత్రి, డివిజన్ కమిటీ సభ్యులు సువర్ణపాక పార్వతి, సీపీఐ మండల కార్యదర్శి రేసుఎల్లయ్య, లాజర్, ఎన్డీ నాయకులు బత్తిని సత్యం, పాపారావు, ఈసం చంద్రయ్య, గొగ్గెలవెంకటేశ్వర్లు,రాంబాబు,ఉప్పయ్య, తదితరులుపాల్గొన్నారు. ఎస్‌ఐ కుమార స్వామి చర్చలుజరిపి అబ్బయిని వివాహనికి ఒప్పిచడంతో దీక్షను విరమించారు.