Search
Saturday 22 September 2018
  • :
  • :

పశ్చిబెంగాల్‌లో తుఫాను.. 15మందికి గాయాలు

ACCIDENTనదియా : పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో ఆకస్మిక తుఫాను అలజడి సృష్టించింది. జిల్లాలోని కులగచ్చి దక్షిణ్ గ్రామంలో తుఫాను ధాటికి 50ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 15మందికి గాయాలయినట్లు తెలిపారు. తుఫాను ప్రభావానికి నిరాశ్రయులైన బాధితులకు ఆహారంతో పాటు సహాయక సామాగ్రిని అందజేశామని తెలిపారు. తుఫాన్ ధాటికి పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు.

Comments

comments