Search
Wednesday 26 September 2018
  • :
  • :

వజ్రాన్ని మించిన గట్టిదనం దీని సొంతం

Lonsdaleite-Diamonds2ఇప్పటి వరకు మనకు తెలిసి భూమిపై అత్యంత గట్టి పదార్థం వజ్రం మాత్రమే. కానీ వజ్రం కన్నా గట్టి పదార్థం మరోకటి ఉంది. అదే ‘లాన్స్‌డైలెట్’. ఆరు కోణాల ఆకారంలో భారీగా కార్భన్ అణువులతో నిర్మించబడి ఉంటుంది. ఈ పదార్థాన్ని షట్కోణ వజ్రం అని కూడా అంటారు. ఆకారంలో చూడడానికి వజ్రాన్ని తలపిస్తున్న లాన్స్‌డైలెట్ సాధారణ వజ్రం కంటే 58 శాతం అధిక గట్టిదనాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గ్రానైట్ రాయి కలిగిన ఉల్కలు భూమిని తాగినప్పుడు ఆ వేడితోపాటు ఒత్తిడికి గ్రాఫైట్ లాన్స్‌లైట్‌గా మారుతుందట. దీనిని మొట్టమొదటిసారి శాస్త్రతవేత్తలు 1966లో కనుగొన్నారు. ప్రస్తుతం కృత్రిమ లాన్స్‌డైలెట్ తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ సహజ లాన్స్‌డైలెట్ గట్టిదనం రావడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Comments

comments